
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైసిపి పార్టీ నుంచి టిడిపి జనసేన పార్టీలోకి వెళుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం వైసీపీ పార్టీ నుంచి కూటమిలోకి చేరారు.. అయితే ఇప్పుడు తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీకి భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో రాజంపేట నియోజకవర్గంలోకి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రమణ్యం తాజాగా టిడిపి పార్టీకి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది.
తన రాజీనామా లేఖ సీఎం చంద్రబాబు కు లేఖ ద్వారా తెలియజేశారు.. ప్రజల సలహాలు సూచనలు మేరకు అభిప్రాయాలను గౌరవిస్తూ టిడిపి పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ లేఖ ద్వారా తెలిపారు. అలాగే మరొకవైపుగా గత కొన్ని నెలలుగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో టిడిపి నేతలు మధ్య వర్గ విభేదాలు ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా అక్కడి కీలకమైన నేతలుగా ఉన్న పద్మప్రియ, చంగల రాయుడు వర్గీయుల సైతం భేటీ అయినట్లుగా తెలుస్తోంది.
టిడిపి ఇన్చార్జిగా చెంగల రాయుడు పదవి ఇవ్వాలని.. అక్కడి కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉన్నారు. అలాగే రాజంపేటలో వైసిపి కోవర్టులను చేర్చుకోవద్దండి అంటూ టిడిపి కార్యకర్తలు కోరుకుంటున్నారు నిజమైన కార్యకర్తలకు పార్టీలో అసలు గుర్తింపు లేకుండా పోతుందని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోని సుఖవాసి బాలసుబ్రమణ్యం టిడిపి పార్టీకి గుడ్ బై చెప్పడంతో అందరూ షాప్ కి గురయ్యారు.