ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు పైన ప్రముఖ రాజకీయ విశ్లేషకులలో ఒకరైన ప్రొఫెసర్ కంచె ఐలయ్య పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి తిరిగి రాకపోతే కచ్చితంగా టిడిపి పార్టీ దెబ్బతింటుందని భావించిన చంద్రబాబు నాయుడు.. ఎలాంటి పని చేయడానికి అయినా వెనకాడరు అంటూ ఆయన అభిప్రాయంగా తెలిపారు. జనసేన, బిజెపి పొత్తు పెట్టుకోవడం టిడిపి పార్టీకి చాలా అనుకూలంగా 2024 లో మారిందని.. గతంలో చంద్రబాబు, మోదిని ఎన్నో విమర్శలు చేశారు. మళ్ళీ ఇప్పుడు మిత్రుడుగా మలుచుకోవడం చాలా వ్యూహాత్మకం అంటూ తెలిపారు.



చంద్రబాబు అరెస్టు అయిన తరువాతే ప్రజలలో సానుభూతి పెరిగిందని అదే టిడిపి పార్టీకి బలంగా మారిందని తెలిపారు. ఇలాంటి సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రణాళిక పైన కూడా చాలా సూచనలు ఉన్నాయని తెలిపారు.. జగన్ ఒంటరిగా పోటీ చేస్తానని వైఖరి మార్చుకోవాలని ఒక జాతీయ పార్టీతో కలిస్తే మేలు అన్నట్లుగా తన అభిప్రాయమని తెలిపారు ఐలయ్య. దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు కూటమిగా కలుస్తున్నాయని వైసీపీ మాత్రం ఒంటరిగా ఉండడం వల్ల జాతీయస్థాయిలో పాత్ర పెరగాలి అంటే రాజకీయంగా కలయికలు అవసరమని తెలిపారు ఐలయ్య.


ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు పైన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ను బిజెపి భవిష్యత్తులో తమ పార్టీలోకి విలీనం చేసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు.. మహారాష్ట్రహాలోగా కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అందుకు సంబంధించి వ్యూహాలు బిజెపి అమలు చేసేలా కనిపిస్తోంది అంటూ ఐలయ్య తెలిపారు.  అలాగే ఉపముఖ్యమంత్రిగా రామ్ యాధవ్ ను నియమించేలా కూడా బిజెపి వ్యూహం రచించవచ్చు అంటూ తెలిపారు. ప్రాంతీయ పార్టీల హవా తగ్గించాలని బిజెపి వ్యూహంగా అడుగులు వేస్తోందంటూ తెలిపారు ఐలయ్య. ఈ పదేళ్లలో రాజకీయ మార్పులలో కేంద్రం చాలా భిన్నంగా మారిపోయిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: