
ఒక ప్రముఖ కాలేజ్ ఒక పత్రికకు యాడ్స్ ఇస్తే మరో ప్రముఖ కాలేజ్ మరో పత్రికకు యాడ్ ఇచ్చింది. అసలు కాలేజీలు లేని ప్రాంతాలలో వఛ్చిన ర్యాంకులను సైతం తమ కాలేజ్ ర్యాంకులని ప్రచారం చేసుకోవడం ఈ కాలేజీలకు ఎలా సాధ్యమవుతుందో అర్థం కావడం లేదు. తమ మెటీరియల్ ప్రిపరేషన్ తో విద్యార్థికి ర్యాంక్ వచ్చిందని అద్భుతంగా ప్రచారం చేసుకోవడం ఈ కాలేజీలకు చెల్లుబాటైంది.
ర్యాంకులను సైతం రెండు ప్రముఖ కాలేజీలు ఇష్టానుసారం పంచేసుకున్నాయి. 100 లోపు కేవలం 11 ర్యాంకులు మాత్రమే తెలుగు రాష్ట్రాలకు సొంతం కాగా వాస్తవాలకు యాడ్స్ కు పొంతన లేదు. ఈ యాడ్స్ ను నమ్మి సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు మోసపోతున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థిని ఒక సంస్థ క్లాస్ రూమ్ స్టూడెంట్ అని క్లెయిమ్ చేసుకుంటే మరో సంస్థ ప్రిపరేషన్ స్టూడెంట్ అంటూ క్లెయిమ్ చేసుకుంది.
ఈ కాలేజీలకు ప్రముఖ సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. 18వ ర్యాంకును తెలుగు స్టేట్స్ టాప్ ర్యాంకు అంటూ మరో సంస్థ క్లెయిమ్ చేసుకుంది. తమ మెటీరియల్ ను చదివారని, తమ వెబ్ సైట్ లో మాక్ టెస్ట్ లు రాశారని చెప్పి ఆ ర్యాంకులను సైతం కాలేజీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాల్సి ఉంది. ర్యాంకుల కార్పొరేట్ మాయాజాలం గురించి తీన్మార్ మల్లన్న లాంటి నేతలు ప్రశ్నిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది.