
ఈ అరుదైన మూలకాలు సిరామిక్, వైద్య పరికరాలు, గాజు, రాకెట్ సైన్స్, అణు రియాక్టర్లలో కీలక పాత్ర పోషిస్తాయి. రామగుండం రెండో ఉపరితల గని మట్టిలో వెనేడియం, స్ట్రాంటియం, జిర్కోనియం వంటి మూలకాలను జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఖనిజాల వాణిజ్య ఉత్పత్తి సింగరేణి ఆదాయాన్ని పెంచడంతోపాటు దేశ ఖనిజ రంగానికి ఊతమిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
మంచిర్యాలలోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ ప్లాంట్ నుంచి రోజూ వేల టన్నుల బూడిద వెలువడుతుంది. ఈ బూడిదలో ఆర్‌ఈఈల ఉనికిని పరీక్షలు ధ్రువీకరించాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ రంగంలో ముందడుగు వేయడానికి ప్రోత్సాహం ఇస్తోంది. సింగరేణి ఈ మూలకాలను వాణిజ్యపరంగా వినియోగించేందుకు అధ్యయనాలను వేగవంతం చేసింది.
ఈ మూలకాల గుర్తింపు, విశ్లేషణ కోసం సింగరేణి జియో సైన్స్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. బొగ్గు గనుల మట్టిలోని ఖనిజాలను పూర్తిగా అన్వేషించేందుకు ఈ ల్యాబ్ కీలకం. ఈ చర్యలు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఆర్‌ఈఈలతో సింగరేణి స్థానాన్ని బలోపేతం చేస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు