
అలా విజయం తర్వాత కూటమి పాలన ఏడాది కంప్లీట్ చేసుకుంది .. ఇక మరి ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం పేదలను అసలు పట్టించుకుందా ? వైసీపీ చెప్పినట్టు వదిలేసిందా ? అనే విషయాలని పరిశీలిస్తే .. ఒకవైపు రాష్ట్రానికి అభివృద్ధి పెద్దపీట వేస్తూనే , మరోవైపు పేదలకు .. ఈ ప్రభుత్వం తన వంతు ఆపన్న హస్తం ఇస్తుంది .. అలాగే పేదల పక్షపతిగా కూడా నిలుస్తుంది ప్రధానంగా సంక్షేమమే కాకుండా .. పేదల అభివృద్ధి కోణంలోనూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని కొంత ఆలోచింపచేస్తున్నాయి .
1. పింఛన్ల పెంపు: సామాజిక బాధ్యత పింఛన్లను రూ.1000 పెంచి రూ.4000 చొప్పున ప్రతి నెల ఒకటో తారీఖునే అందిస్తున్నారు .. వీటిని తీసుకుంటున్నవారు పత్తు పేదలన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. తద్వారా వారిలో ఆర్థిక స్థిరత్వం పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది .
2. గ్యాస్ సిలిండర్లు: ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పేదలకు ఇస్తున్నారు .. గత ఏడాది అక్టోబరులో మొదలుపెట్టిన ఈ పథకం కింద .. ఇప్పటికే రెండు సిలిండర్లు ప్రజలకు అందించారు .. పెద్ద కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాలను కొంత తగ్గిస్తున్నారు .
3. పన్నుల ఎత్తివేత: వైసిపి గవర్నమెంట్ లో ప్రతి ఇంటికి చెత్త పై పన్ను పెట్టారు .. ఇక కూటమి ప్రభుత్వం దీన్ని అధికారంలోకి రాగానే ఎత్తివేసింది .. అలాగే కనీసంలో కనీసం ఏటా 800 చొప్పున పేదలకు మేలు చేస్తుంది .. అలాగే నేలకు 70 చొప్పున వేసుకున్న ఏడాదికి పేదల పై 840 చొప్పున భారం తగ్గుతుంది .
4. ఇంటి నిర్మాణానికి రూపాయే: పేదల సొంత ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చే ప్రక్రియలో కూడా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది .. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ, జీ+1 నివాసాలపై ప్రభుత్వం కేవలం ఒక్క రూపాయికే అనుమతులు మంజూరు చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది .. దీన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతున్నారు .
5. అన్న క్యాంటీన్లు: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను 213 ఏర్పాటు చేశారు .. రాబోయే రోజుల్లో ఇంకా ఏర్పాటు చేయబోతున్నారు . ఐదు రూపాయలకే టిఫిన్ , భోజనం అందించే ఈ క్యాంటీన్లతో పేదలకు ఆకలి తీరుతుంది .. ఇది ఎంతో మేలైన పరిణామంగా కూడా ప్రజల మధ్య గట్టి చర్చ నడుస్తుంది .. ఇలా పేదల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం తన మొదటి సంవత్సరంలోనే కీలక అడుగులతో ముందుకు వెళ్ళింది .