BRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్  తో సహ మరి కొంత మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు నిన్నటి రోజున హైదరాబాదులోని ప్రముఖ మీడియా ఛానల్ పై దాడి చేసిన సంఘటన తెలంగాణ అంతా కూడా సంచలనంగా మారింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లేనిపోని కథనాలను బిఆర్ఎస్ పార్టీ పైన సృష్టించారని విధంగా దాడి చేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ దాడి పైన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తాజాగా స్పందించినట్లు తెలుస్తోంది.


ఏ ప్రజాస్వామ్యంలోనైనా సరే భౌతిక దాడులు ఎన్నటికీ ఆస్కారం ఉండదని వెల్లడించారు.. అలాగే అబద్ధాలకు కూడా ఆ సందర్భాల ప్రేలాపనలకు కూడా మీడియా ముసుగును అడ్డుకుపెట్టుకొని మరి కొంతమంది నీచపు రాజకీయాలు పాల్పడుతున్నారు.. అలాంటి వాటికి అస్సలు స్థానం కల్పించకూడదని తన అభిప్రాయంగా తెలియజేశారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు గుంపు మేస్త్రి, అతని మిత్రులు చేస్తూ ఉంటారని ఫైర్ అయ్యారు కేటీఆర్. బిఆర్ఎస్ శ్రేణులు ప్రశాంతంగా ఉండాలని కార్యకర్తల బాధ, గౌరవం ఉందని..తన పైన అలాగే పార్టీ పైన చూపించిన ప్రేమను అర్థం చేసుకోగలను అంటూ తెలియజేశారు కేటీఆర్.


కానీ మనం దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించినప్పుడు నిందలు అబద్ధాలు వంటివి తప్పవని తెలియజేశారు. సిగ్గు లేకుండా ఇలాంటి బురద రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని కచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటూ హెచ్చరించడం జరిగింది.. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకపోవడం పైన ఫోకస్ పెట్టాలని కార్యకర్తలకు నాయకులకు సైతం పిలుపునిచ్చారు కేటీఆర్. అయితే ఇప్పటికే ప్రముఖ ఛానల్ పైన దాడిని చాలామంది నేతలు కూడా ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వం కూడా ఈ దాడి వెనుక ఉన్న వారందరినీ కూడా కచ్చితంగా గుర్తించి వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ ఛానల్ బాధితులకు హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: