- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణలో త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో గత నెలలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో రెండు మూడు నెలల జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ తో పాటు తెలంగాణలో మరో అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నిక రానుందా ? అంటే అవును అన్న చర్చలు తెలంగాణ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో హైద‌రాబాద్ లోక్‌స్థానం ప‌రిధిలో ఉన్న‌ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున వరుసగా మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ పై అనర్హత వేటు వేసేందుకు బిజెపి జాతీయ నాయకత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.


పార్టీ ప్రముఖులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల బీజేపీ అధిష్టానం ఆగ్రహంగా ఉందని సమాచారం. రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు నామినేషన్ పేప‌ర్లు ఇచ్చినా రాజసింగ్ నామినేషన్ దాఖలు చేయలేదని చెబుతోంది. ఇక రాజాసింగ్ రాజీనామా ఆమోదిస్తూ అతనిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాసేందుకు బిజెపి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే స్పీకర్ నిర్ణయం తీసుకుని రాజాసింగ్ ఎమ్మెల్యే సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తే మహల్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఒకేసారి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: