
అమెరికా ప్రభుత్వం చాలా క్లియర్‌గా ఒకే ఒక్క మాట చెబుతోంది. "చదువుకోవడానికి వస్తున్నారా, మోస్ట్ వెల్‌కమ్. కానీ చదువు పేరు చెప్పి వేరే యాక్టివిటీస్ చేస్తే మాత్రం 'గెట్ అవుట్' అంటాం". ఏ పర్పస్ మీద వీసా తీసుకున్నారో ఆ పని మాత్రమే చూసుకోవాలి. క్యాంపస్‌లో హంగామా చేసినా, ప్రభుత్వ రూల్స్ బ్రేక్ చేసినా మీ వీసాకు అక్కడికక్కడే ఫుల్‌స్టాప్ పడినట్టే. మా దేశ భద్రతే మా ఫస్ట్ ప్రయారిటీ, ఆ విషయంలో నో కాంప్రమైజ్ అని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చింది.
ఇదే అసలైన గేమ్ ఛేంజర్. మీ వీసా ఫ్యూచర్ మొత్తం ఇప్పుడు మీ సోషల్ మీడియా చేతుల్లోనే ఉంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్.. అన్నీ ఇప్పుడు అమెరికా అధికారుల స్కాన్‌లో ఉంటాయి. అప్లై చేసే ముందు మీ సోషల్ మీడియా ఖాతాలన్నీ 'పబ్లిక్' మోడ్‌లో పెట్టడం మస్ట్. మీ పాత పోస్టులు, మీ పొలిటికల్ కామెంట్స్, మీరు షేర్ చేసే మీమ్స్ కూడా మీ వీసాను డిసైడ్ చేస్తాయి. ఈ రూల్ చిన్నగా బ్రేక్ చేసినా, అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడమే కాదు, మీ పేరు అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో చేరడం గ్యారెంటీ.
ఇప్పటికే అమెరికాలో ఉన్న F1, J1 వీసా స్టూడెంట్స్‌కు ఇది మరో టెన్షన్. మీ వీసా గడువుపై కొత్త రూల్స్ తీసుకురాబోతున్నారు. ఇకపై వీసా ఎక్స్‌టెన్షన్ అనేది ఊహించినంత ఈజీ కాదు. ప్రతీసారి కొత్త టెన్షన్, కొత్త ప్రాసెస్ తప్పదు. కోర్సు పూర్తయ్యేలోపు ఎన్నిసార్లు ఈ గండం గట్టెక్కాలోనని విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు.
సో, అమెరికా వెళ్లాలనుకునే వాళ్లు కేవలం మీ సర్టిఫికెట్స్ మాత్రమే కాదు, మీ సోషల్ మీడియా ప్రొఫైల్‌ను కూడా క్లీన్‌గా ఉంచుకోవడం బెటర్. లేదంటే డాలర్ డ్రీమ్స్ కల్లలుగానే మిగిలిపోతాయి.