ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.
ఆగస్ట్ 15 నుంచి కొత్త జిల్లాల పరిధిలో ప్రయాణం ఉచితం ! ఈ ప్రకటనతో మహిళలలో ఆశ పెరిగింది… కానీ కొందరిలో అసహనం! ఎవరంటే?
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ! వైసీపీకి ఇప్పుడు బాధ ఏమిటంటే… ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడమే వారికి కడుపునొప్పి! తాము అధికారంలో ఉన్నప్పుడు మహిళల కోసం ఏమీ చేయలేకపోయారు. అమ్మ ఒడి పద్ధతి పేరిట మోసం , నవరత్నాల పేరిట కలలూ – ఫలితమేమీ లేదు.. వలసలు, అప్పులు, పెట్రోల్ రేట్లు – అన్ని పెరిగినా… ప్రభుత్వం పట్టించుకోలేదు ..


ఇక ఇప్పుడు కూటామి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి దిశగా అడుగులు వేస్తుంటే… వెంటనే వ్యతిరేక ధ్వని మొదలైంది. ప్రారంభ దశలో కొత్త జిల్లాల పరిధిలో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఖజానా ఖాళీ చేసింది గత ప్రభుత్వమే… అందుకే ఫేజ్ వైజ్ అమలు చేస్తున్నాం. పోలవరం స్కాం, విద్యుత్ ఒప్పందాల మూలంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పుడైనా అభివృద్ధి వైపు చూడాలంటే… స్థిరమైన అడుగులు అవసరం. 2014–2019 టీడీపీ హయాంలో మహిళలకు పసుపు కుంకుమ, వివాహ రుణ మాఫీ, స్మార్ట్ రేషన్, అమ్మకూర బస్ వంటి పథకాలు ప్రవేశపెట్టారు. అయితే వైసీపీ హయాంలో? “వైసీపీ హయాంలో మాటలు ఎక్కువ… ఫలితాలు తక్కువ. అని ప్రజలే చెప్పారు.


ఇక ఇప్పుడు కూడా ప్రజలు చూస్తున్నారు – “చేసేవాడికి వ్యతిరేకంగా మాట్లాడటం వైసీపీ అలవాటు” అని చర్చిస్తున్నారు. మహిళలకు ప్రయోజనం చేకూరేలా పాత జిల్లాలకే విస్తరించే ఆలోచన జిల్లాల మధ్య ప్రయాణం అంటే ఖచ్చితంగా 40-60 కిలోమీటర్లు అది ఉచితంగా చేస్తే రియల్ బెనిఫిట్ + యాక్చువల్ ఆక్యుపెన్సీ వస్తుంది.. అదే మహిళల మెప్పు, టీడీపీకి మైలెజ్‌ తెస్తుంది ! వైసీపీ మాదిరి పథకాలను పేపర్లో పెడితే సరిపోదు … టీడీపీ కూటామి మాదిరి ఆచరణలో పెట్టాలి ! ఎన్నికల హామీల‌ని మొదటి రెండు నెలల్లోనే నెరవేర్చిన చంద్రబాబు… ఇంకా ఏమీ ప్రారంభించలేదని విమర్శించే వైసీపీకి – "మీ ఐదేళ్లు గుర్తు పెట్టుకోండి!" అనే సమాధానం మహిళలు  ఇస్తున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: