
అయితే ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి 10:00 గంటల సమయంలో జరగడంతో టాపు పైన కూర్చున్న కూలీలు మామిడికాయల లోడు కింద పడడంతో కొంతమంది అక్కడికక్కడే మరణించగా మరి కొంతమంది ఎగిరి దూరంగా పడడంతో గాయాలయ్యాడ. అలా లారీ కిందపడిన కూలీలు 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడ స్థానికుల సహాయంతో చర్యలు చేపట్టారు. గాయాలైన వారు చికిత్సకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే మరణించిన కూలీల విషయానికి వస్తే రైల్వే కోడూరు మండలం శేట్టిగుంట గ్రామానికి చెందిన వారంటూ పోలీసులు గుర్తించారు. ఇందులో మృతి చెందిన వారు గాయాలైన వారందరూ కూడా ప్రతిరోజు కూలి పనులు చేస్తే తప్ప ఒక్క పూట కూడా భోజనం చేయలేని వారేనట. ఈ సంఘటన స్థలాన్ని ఎస్పి రామ్నాథ్ కార్గే పరిశీలించారు. అనంతరం ఈ రోడ్డు ప్రమాదం గురించి మంత్రి జనార్దన్ రెడ్డి జిల్లా ఉన్నత అధికారుల వరకు తీసుకు వెళ్లినట్లు సమాచారం. అలాగే గాయపడిన వారికి వైద్యం అందించాలని అధికారులకు కూడా ఆదేశాలు ఆదేశాలను జారీ చేయడమే కాకుండా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందంటూ తెలిపారు.