మనలో చాలామంది సమోసా,  జిలేబీ  తినడానికి  ఎంతగానో  ఇష్టపడతారు.  అయితే ఇకపై సమోసా,  జిలేబీ ప్రియులకు షాకింగ్  న్యూస్.  ఉండబోతుందని  సమాచారం అందుతోంది.  సమోసా,  జిలేబీ ప్రియులకు వార్ణింగ్  మెసేజెస్ ఇచ్ఛేలా కేంద్రం  అడుగులు వేయనుందని  తెలుస్తోంది.  భారతీయులు సమోసా,  జిలేబీలను ఎంతగానో ఇష్టపడతారు.  చాలామందికి ప్రస్తుతం సమోసా కామన్  స్నాక్ గా మారిపోయింది.

దేశంలోని అన్ని రాష్ట్రాల భోజన ప్రియులకు సమోసా  ఫేవరెట్ స్నాక్ కాగా  నార్త్ లో ఉండే వాళ్ళు  జిలేబీలకు సైతం  తింటారని చెప్పవచ్చు.  మన భారతీయుల జీవితాలలో వీటికి   ఉండే ప్రాధాన్యత అంతాఇంతా  కాదు.  ఈ ఆహారాలు ఆరోగ్యానికి హానికరం అని కచ్చితంగా చెప్పడంలో  సందేహం అవసరం లేదు.  స్నాక్స్ పై ఆరోగ్య హెచ్చరికలు  ఉండటంతో పాటు  ఆయిల్, షుగర్, సాల్ట్ కంటెంట్ ను సైతం పొందుపరచనున్నారని  భోగట్టా.

 వడా పావ్, కచోరీలపై కూడా  ఈ నిబంధనలు అమలు కానున్నాయని తెలుస్తోంది.  ఈ నిబంధలు  అమలులోకి వస్తే ఈ వంటకాల ప్రియులు  ఎలా స్పందిస్తారనే చర్చ సైతం జరుగుతోంది.  ఈ ఆహారాలను  ఎక్కువగా తీసుకుంటే బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి ఆరోగ్య సమస్యల బారిన పడే  అవకాశం ఉంది.  జీఐ వాల్యూ ఎక్కువగా ఉన్న  వంటకాల విషయంలో తగిన  జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

ఈ వంటకాల  వల్ల  శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్  పెరిగే అవకాశం ఉంటుంది.  ఈ  ఫుడ్స్ గుండె సంబంధిత  సమస్యలకు  కారణమవుతాయి.  కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల  జంక్ ఫుడ్  తీసుకునే వాళ్ళ అభిప్రాయం మారుతుందేమో  చూడాల్సి ఉందని  కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి.  జంక్ ఫుడ్స్ వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.  


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: