మనలో చాలామందికి న్యాయపరంగా ఎన్నో సందేహాలు ఉంటాయి.  అయితే ఎవరైనా లాయర్ ను కలవాలంటే  వేలకు వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  కొంతమంది లాయర్లు  సమస్య  వినాలంటే 300 నుంచి 5000 వరకు ఛార్జ్  చేస్తున్న పరిస్థితి నెలకొంది.  ఎందుకు అంత  చెల్లించాలని ప్రశ్నిస్తే న్యాయ సలహాలు  చెప్పడానికి మా సమయం ఎందుకు వృథా చేసుకోవాలంటూ  ప్రశ్నలు వ్యక్తమవుతూ  ఉండటం గమనార్హం.

9 మంది ఫ్రెండ్స్ తో కలిసి  పాలకుర్తి మండలం  చెన్నూరుకు చెందిన ఆదర్శ్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.  సీఎల్ఎన్ఎస్.ఇన్ వెబ్ సైట్ ద్వారా  యాప్ ద్వారా కేవలం  రూపాయి చెల్లించి న్యాయ సలహాలను పొందవచ్చు.  సెంట్రలైజ్డ్  లీగల్ నెట్వర్క్  సొల్యూషన్స్  యాప్ లో రూపాయి చెల్లించి న్యాయ సేవలకు సంబంధించిన  పూర్తీ సమాచారాన్ని పొందే అవకాశాలు అయితే ఉంటాయి.

ఈ యాప్ లో దేశవ్యాప్తంగా  ఉన్న న్యాయవాదులను భాగస్వామ్యం చేశామని  టీహబ్ నుంచి సైతం కార్యకలాపాలను  సాగిస్తున్నామని ఆదర్శ్  పేర్కొన్నారు.  దీని ద్వారా  ఇప్పటివరకు 3,000 మందికి పైగా సహాయ సహకారాలు అందించామని  చెప్పుకొచ్చారు.  న్యాయవాదులు, ప్రజలు, అధికారులను  ఒకే వేదికపై  తీసుకొచ్చేలా  టెక్నాలజీని  రూపొందించామని చెప్పుకొచ్చారు.

ఈ యాప్ లో రిజిష్టర్ చేసుకుని  లాగిన్  కావడం ద్వారా సేవల కోసం పొందే అవకాశం  ఉంటుంది.  ఏఐని జోడించడం ద్వారా  కక్షిదారులకు  అవసరమైన సమాచారం అందే   ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించడం గమనార్హం.  ఈ తరహా యాప్స్ ప్రజలకు ఎంతో  ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పడంలో  ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని కచ్చితంగా చెప్పవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: