
లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వేయగా అందులో తన ప్రమేయం లేకుండా రాజకీయ కక్షలో భాగంగానే తన అరెస్టు చేయాలని చూస్తున్నారంటూ సుప్రీంకోర్టులో దాఖలు వేశారు. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన జస్టిస్ మహదేవ్, జేబి పార్దివలా మిథున్ రెడ్డి తరఫున లాయర్ అభిషేక్ మను వాదనలు వినిపించారు. అలా ఇరువురి పక్షాల వాదనలు విన్న తర్వాత మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటీషన్ ని డిస్మిస్ చేసింది.
దీంతో మిథున్ రెడ్డి పైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధంగానే ఉన్నారు.. అయితే పారిపోవడం అలాంటిది ఇప్పటిదాకా ఏమీ చేయలేదు ఎంపీ మిథున్ రెడ్డి. అయితే ఇప్పటిదాకా లీకల్ గా తనకున్నటువంటి బెనిఫిట్స్ ని యూజ్ చేసుకోవడానికి చూశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి..ఈరోజు ఉదయం విజయవాడకు చేరుకొని అరెస్టు అవుతారు అన్నటువంటిది తాజాగా వినపడుతున్నటువంటి అంశం. ఈరోజు విమానంలో గన్నవరనికి చేరుకుంటారని ఆ వెంటనే అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని.. అరెస్టు కావడానికి మిథున్ రెడ్డి కూడా సిద్ధంగానే ఉన్నారని పోలీసులకు ఇన్ఫామ్ చేశారనే విధంగా వినిపిస్తున్నాయి.