- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచి తద్వారా ప్రవేశాలు పెంచడమే తమ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తన నిబద్ధతతో కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయురాలు యలమంచిలి దుర్గా భవానిని ‘షైనింగ్ టీచర్’ పేరుతో ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మా లక్ష్యం ఒక్కటే, వచ్చే నాలుగేళ్లలో ప్రైవేటు స్కూల్స్ అడ్మిషన్లు తగ్గాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగాలి. ప్రభుత్వ పాఠశాలల ముందు అడ్మిషన్స్ క్లోజ్డ్ అని బోర్డులు ఉండాలనేదే మా లక్ష్యం. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందిస్తారని తల్లిదండ్రులు నమ్ముతారు. అప్పుడే మనం నిజంగా సాధించినవారమవుతాం. ఇందుకోసం చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు.


విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దుర్గా భవాని కృషి
కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలిగా గత ఐదేళ్లు పనిచేసిన యలమంచిలి దుర్గాభవాని వృత్తి పట్ల నిబద్ధత చూపి విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దారు. 2025 ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో 54 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. ఏడుగురు విద్యార్థులు ప్రతిష్టాత్మక ఐఐఐటీల్లో ప్రవేశాలు పొందారు. వరుసగా మూడేళ్ల పాటు పదుల సంఖ్యలో విద్యార్థులు ఎన్ఎమ్ఎమ్ స్కాలర్ షిప్ సాధించారు. రాష్ట్రంలో మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే ఈవెంట్ నిర్వహించారు. పీఎంశ్రీ యోజన పథకం కింద పాఠశాల ఎంపికైంది. కమ్యునిటీ మొబిలైజేషన్ ద్వారా వాల్ ఆర్ట్స్, డ్యాన్స్, మ్యూజిక్ క్లాస్ లు, కంప్యూటర్ శిక్షణ అందించారు. ఆమె ఆధ్వర్యంలో పాఠశాల వినూత్న ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది. అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు తాము నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు వారే వినూత్న పరిష్కారాలు కనుగొంటారు. తడిచిన ధాన్యం ఆరబోసే యంత్రంతో పాటు ఐరెన్ బాక్స్ హీట్ కంట్రోల్ ఇన్ క్లైన్, పాఠశాలలో చెత్తను శుభ్రం చేసేందుకు పాతవస్తువుల నుంచి బ్లోయర్ తయారీ, ఆల్కహాల్ సెన్సింగ్ హెల్మెట్ వంటి నవీణ ఆవిష్కరణలను విద్యార్థులు రూపొందించారు.     


ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సలహాలు సూచనలు స్వీకరించిన మంత్రి లోకేష్
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానోపాధ్యాయురాలు దుర్గా భవాని నుంచి విద్య, ఐటీ శాఖల మంత్రి ఈ సందర్భంగా సలహాలు, సూచనలు స్వీకరించారు. అద్భుతమైన పనితీరుతో ఉపాధ్యాయులందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకే ఉపాధ్యాయులను నేరుగా కలవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మొదటి ఏడాదిలో సంస్కరణలు చేపట్టామని, అవి అమలయ్యే తీరు క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకే తెలుస్తుందన్నారు. ప్రతి విద్యార్థి ముఖ్యమేనని, వచ్చే నాలుగేళ్లు విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృష్టిసారిస్తామన్నారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (లీప్) ద్వారా  ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ఇందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం కావాలని తెలిపారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: