
అయితే.. అక్కడ కూడా వర్మకు ఆశించినట్టుగా ఎలాంటి ఉపశమనం లభించలేదని తెలిసింది వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే వర్మకు.. ఎమ్మెల్సీ టికెట్ ఖాయమని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు ప్రచా రం జరిగింది. కానీ, ఇప్పటికి రెండు విడతలుగా ఎమ్మెల్సీలను భర్తీ చేసినా వర్మ పేరు ఎక్కడా కనిపించ లేదు. ఆయన పేరు వినిపించనూ లేదు. దీనిని బట్టి.. ఇప్పుడోరేపో.. ఏదో ఒక పదవి ఇవ్వక పోతారా? అని వర్మ ఎదురు చూస్తున్నారు. కానీ, ఆయనకు పార్టీ నుంచి సంకేతాలు రావడంలేదు.
మరోవైపు పిఠాపురంలో జనసేనకు-టీడీపీకి మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. గతంలో ఎన్నికలకు ముందు.. తర్వాత.. జనసేన నాయకులు వర్మను కలుసుకునే వారు. కానీ, తర్వాత.. మాత్రం ఖచ్చితంగా విభజన రాజకీయాలు కనిపిస్తున్నాయి. వర్మపై దాడులు.. విమర్శలు కామన్‌గా మారాయి. అయితే.. తాజాగా ఈ విషయాలను కూడా పార్టీ నేతల దృష్టికి వర్మ తీసుకువెళ్లారు. పార్టీ ఇబ్బందుల్లో ఉందని.. జనసేన దూకుడు ముందు.. మన కార్యకర్తలు మౌనంగా ఉంటున్నారని చెప్పుకొచ్చారని తెలిసింది.
అయితే.. దీనిని తాము చూసుకుంటామని.. వర్మకు పార్టీ కీలక నాయకులు సెలవిచ్చారు. ఇదేసమయం లో ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేమని స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో వర్మ ఎంతో హుషారుగా పార్టీ నేతల ను కలిసినా.. ఏమాత్రం సంతోషం లేకుండానే ఆయన తిరుగు టపాలో పిఠారానికి చేరుకున్నారు. ఇదిలావుంటే.. వర్మ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న వైసీపీ అధిష్టానం.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. పార్టీలు మారే సంస్కృతి తనకు లేదని వర్మ అంటున్నారు. మొత్తానికి పిఠాపురం రాజకీయాలు మాత్రం సస్పెన్సుగానే ఉన్నాయి.