- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు శుభవార్త వ‌చ్చేసింది. కూట‌మి ప్ర‌భుత్వం వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అందించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం ప్రధాన లక్ష్యం – మహిళల రవాణా ఖర్చును తగ్గించడంతో పాటు, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడటం. ముఖ్యంగా ఉపాధి, విద్య, ఆరోగ్య అవసరాల కోసం తరచూ ప్రయాణించే మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్న నేపథ్యంగా, ఇప్పుడు ఏపీ కూడా అదే బాటలో అడుగేస్తోంది. వాస్త‌వానికి చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సూప‌ర్ 6 హామీల్లో భాగంగా మ‌హిళ‌లకు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు అయ్యి యేడాది దాటి పోయింది . 13 నెల‌లు అవుతోంది. ఇంకా ఉచిత బ‌స్సు ప్ర‌యాణం మ‌హిళ‌ల‌కు కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌లేదు. దీంతో ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.


ఎట్ట‌కేల‌కు వ‌చ్చే ఆగ‌స్టు 15 నుంచి ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం అమ‌లు చేస్తామ‌ని ప్ర‌భుత్వం వ‌ర్గాలు.. ఇటు మంత్రులు కూడా చెపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీ వ్య‌వ‌సాయ , స‌హ‌కార శాకా మంత్రి కె. అచ్చెన్నాయుడు సైతం మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు పథ‌కం అమ‌లు పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆగ‌స్టు 15 నుంచే ఈ ప‌థ‌కం అమ‌లు అవుతుంద‌ని చెప్పారు. ఇది ఏ ఒక్క జిల్లా కో ప‌రిమితం కాద‌ని.. రాష్ట్రం అంత‌టా మ‌హిళ‌లు ఉచితంగానే ప్ర‌యాణం చేయ‌వ‌చ్చ‌న్నారు. అయితే 5 ర‌కాల బ‌స్సుల్లోనే ఈ ప్ర‌యాణం అమ‌లు చేస్తామ‌న్నారు. దీంతో ఈ ట్విస్ట్ ఏంటా ? అన్న ఆస‌క్తి నెల‌కొంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: