
సాధారణంగా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మంత్రివర్గంలోకి వచ్చిన ఆయన, తన పనితీరుతో అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. రెండో స్థానంలో యువనేత నారా లోకేష్ ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. తన నియోజకవర్గంలో చురుకైన పర్యటనలు, డెవలప్‌మెంట్ ప్రాజెక్టులపై కట్టుదిట్టమైన ఫోకస్, యువతలో క్రేజ్ కారణంగానే ఆయన ఈ ర్యాంక్ సాధించారని భావిస్తున్నారు. మూడో స్థానంలో సత్య కుమార్ ఉండగా, నాలుగో స్థానంలో అనిత, ఐదో స్థానంలో నాదెండ్ల మనోహర్ నిలిచారు. ఇక ఈ లిస్టులో చివరి స్థానాల్లో ఉన్న వారు మాత్రం ఆందోళనలో పడిపోయేలా ఉంది. ముఖ్యంగా కొల్లు రవీంద్ర తక్కువ ర్యాంక్ పొందడం షాక్‌గా మారింది. ఆయనతో పాటు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ వంటి సీనియర్లు కూడా ఈ ర్యాంకింగ్‌లో వెనుకబడ్డారని తెలుస్తోంది.
ఇది పార్టీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబు ఈ ర్యాంకింగ్ వెనుక ఉద్దేశం మాత్రం క్లియర్ – టాప్‌లో ఉన్నవారికి ప్రోత్సాహం ఇవ్వడం, చివరలో ఉన్నవారికి కఠినమైన వార్నింగ్ ఇవ్వడం. అసలు ఈ ర్యాంక్ సిస్టమ్ ద్వారా మంత్రులు మరింత ఫోకస్ అయ్యి, జవాబుదారీదనం పెంచుకుంటారని సీఎం భావిస్తున్నారట. ఇకపోతే, ఈ ర్యాంకింగ్స్ బయటకు రావడం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. “మన మంత్రి ఎందుకు వెనకబడ్డారు?” అని ప్రజల్లో ప్రశ్నలు మొదలవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ర్యాంకులు మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం – చంద్రబాబు తీసుకున్న ఈ డిసిషన్ ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.