ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జరగ‌నుంద‌నే వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ సారి ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌కు మంత్రివ‌ర్గంలో అవ‌కాశం ఖాయ‌మ‌న్న చ‌ర్చ టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. వారిలో ఒకరు రాయలసీమకు చెందిన మహిళా ఎమ్మెల్యే కాగా, మరొకరు ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు అని సమాచారం. మ‌హిళా ఎమ్మెల్యే విష‌యంలో.. సీమ‌ జిల్లాల‌కు చెందిన ఈ యువ నాయకురాలి పనితీరు పట్ల చంద్రబాబు సంతృప్తిగా ఉన్నార‌ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమెను ఎస్సీ కోటాలో మంత్రివర్గంలోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం బలంగా వినిపిస్తోంది. దీంతో సీమలో పార్టీ బలం పెంచుకునే అవకాశముందని, ప్రత్యేకించి మహిళా ఓటర్లలో పార్టీకి మరింత ఆదరణ లభిస్తుందనే లెక్కతో ఆమెకు మంత్రి ప‌దవి దక్కడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి.


ఇక ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నాయకుడి విషయంలో.. ఆయ‌న ఇప్పటికే ఒక ముఖ్య పదవిలో కొనసాగుతున్నా ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారట. వినయం, విధేయత, పార్టీ పట్ల అంకితభావం ఆయనకు ప్లస్ పాయింట్లుగా మారాయి. అంతేకాకుండా ఆయన చెందిన సామాజిక వర్గం కూడా రాజకీయంగా ప్రభావవంతం కావడంతో, ఆ వర్గాన్ని ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతో మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల దృష్ట్యా మంత్రి వర్గంలో ఎప్పుడు మార్పులు వచ్చినా, ఈ ఇద్దరు నేతలకు అవకాశం దక్కడం ఖాయం అన్న చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, పార్టీకి విధేయంగా, అధినేత మాట విని ముందుకు సాగుతున్న వారినే ప్రోత్సహించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి ప్రమోషన్ ఖాయం అన్న అంచనాలు మరింత బలపడుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: