
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ చంద్రబాబు జగన్ కు సవాల్ విసరగా అసెంబ్లీకి వచ్చి బాబు సవాల్ కు జగన్ ధీటుగా స్పందిస్తారా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. మీ పేపర్, మీ ఛానల్ లో రాసుకుంటే సరిపోతుందా తప్పుడు ప్రచారాలు చేస్తే అస్సలు సహించనంటూ చంద్రబాబు నాయుడు కామెంట్లు చేశారు.
మరి జగన్ ఈ ఛాలెంజ్ విషయంలో దమ్ము, ధైర్యంతో ముందడుగులు వేస్తారా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు భువనేశ్వరిపై వైసీపీ నేతలు కామెంట్లు చేయనంత వరకు కూడా ప్రతి అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు. ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు వాటిని తట్టుకుని ముందడుగులు వేయడం జరిగింది. అయితే జగన్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే నెపంతో జగన్ తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోనని చెబుతున్నారు. జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆయనను ప్రజలకు మరింత దూరం చేస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
జగన్ సరైన నిర్ణయాలు తీసుకుని ముందడుగులు వేస్తే మాత్రం పార్టీకి పూర్వ వైభవం దక్కడానికి ఎంతో సమయం పట్టదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ పాదయాత్రను ఎప్పటినుంచి మొదలుపెడవుతారో చూడాల్సి ఉంది. జగన్ లక్ష్యాలను సాధించాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు