
రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని షర్మిలా పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకంలో ఇచ్చే ఇరవై వేల రూపాయలు రైతుల అవసరాలకు సరిపోవడం లేదని విమర్శించారు. గతంలో ఉన్న రైతు సంక్షేమ పథకాలను నిలిపివేశారని, పంట నష్టపరిహారం, సబ్సిడీలు, బోనస్‌లు ఏవీ అందడం లేదని ఆమె గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ సాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆమె నొక్కి చెప్పారు.రైతులకు కనీస మద్దతు ధర (MSP) అందడం లేదని షర్మిలా ఆక్షేపించారు. మిరప, పొగాకు, జొన్న, పత్తి, అరటి వంటి పంటలు తక్కువ ధరలకే అమ్ముడవుతున్నాయని, రైతులు నష్టపోతున్నారని ఆమె తెలిపారు.
ప్రభుత్వం రైతులను పరామర్శించడం కూడా మానేసిందని, వారు దిక్కులేని స్థితిలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తుందని షర్మిలా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తూ, రైతులకు MSP విషయంలో అన్యాయం జరుగుతున్నా నిశ్శబ్దంగా ఉన్నారని ఆమె ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు తమ వైఖరిని సమీక్షించుకోవాలని ఆమె సూచించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు