- ( నెల్లూరు - ఇండియా హెరాల్డ్ ) . . .

టిడిపి నేతలలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఓ ప్రత్యేకత ఉంది. ఆయన ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు. సైకిల్ వేసుకుని మ‌రీ నియోజకవర్గం మొత్తం తిరుగుతారు.. ప్రజలలో కలిసి పోతారు. అందుకే గత మూడు ఎన్నికలలో వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఏకంగా 70 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన మంచి చేయటానికి ప్రజలను చూస్తారే తప్ప పార్టీలు చూడరు. అందరినీ సమానంగా చూస్తారు. పార్టీ క్యాడర్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఆయన పద్ధతి ఫాలో అయితే ఎమ్మెల్యేలు ఓడిపోరని టిడిపిలో చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే తరహాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తన నియోజకవర్గంలో బలపడుతున్నారు.


శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఓ ఇమేజ్ తో ఉండేవారు. ఇప్పుడు ఆయన మరో రకమైన ఇమేజ్‌ను మారిపోయారు. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు ఆయన ప్రజల్లో ఉంటున్నారు.. ప్రజల మాటలు వింటున్నారు. గతంలోనూ శ్రీధర్ రెడ్డి ఇలాగే ఉండేవారు. అప్పుడు ఆయన పద్ధతి వేరుగా ఉండేది. టిడిపిలోకి వచ్చాక కోటంరెడ్డి పద్ధతి వాస్తవానికి దగ్గరగా ఉంది. సొంత క్యాడర్ బాధలు పట్టించుకోవడం కూడా ఆయన ప్రత్యేక పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రోజుకు 40 మంది పార్టీ కార్యకర్తలను పిలిపించుకొని కష్టనష్టాలు తెలుసుకుంటున్నారు.


అవసరమైతే సాయం చేస్తున్నారు. కుటుంబ పరంగా ఆర్థికంగా సమస్యలు ఉంటే మార్గాలు చెబుతున్నారు. ఈ శైలి క్యాడర్కు ఎంతో సంతోషం ఇస్తుంది. పార్టీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నారు. గతంలో కోటంరెడ్డి పై రకరకాల ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు అలాంటివి ఏమీ ఉండటం లేదు. గతంలో ఆయనను వ్యతిరేకించిన వారు కూడా ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. కోటంరెడ్డిలా ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉండాలన్న చర్చలు ఇప్పుడు టిడిపి వర్గాలలో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: