
పార్టీ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను సృష్టించుకుని, ఆ వ్యవస్థ ద్వారా నిర్ణయాలను అమలు చేయించిందనే ఆరోపణలు కూడా అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. పార్టీలో ముఖ్య నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగిన ధనుంజయ్ రెడ్డి అసలు శక్తి కేంద్రం ఎక్కడన్న ప్రశ్నకి సమాధానం సింపుల్ – భారతి! ఆమె ప్రతినిధిగా ఆయన పనిచేశారని, ముఖ్యంగా సీఎంవో వ్యవహారాల నుంచి పార్టీ అంతర్గత నిర్ణయాల వరకు ధనుంజయ్ ప్రాధాన్యం పెరగడానికి కారణం భారతి వెనుక నిలబడి ఉండడమేనని చాలామంది స్పష్టంగా చెబుతున్నారు. వైసీపీ లోపల ఓటమికి కారణం ఆయనననే మాట వినిపిస్తున్నప్పటికీ, ఆయనకున్న బలం భారతి అనేది వాస్తవం. జగన్ ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యలు, భవిష్యత్తులో జైలు శిక్ష అనే చర్చ వైసీపీ లోపలే కాదు, బయటా బలంగా వినిపిస్తూనే ఉన్నాయి.
అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు జగన్ తరవాత పార్టీని ఎవరు నడిపిస్తారు అన్న ప్రశ్నకు సమాధానం భారతి తప్ప వేరొకరు కాదనే భావన బలంగా పెరుగుతోంది. ఇదే కారణంగా వైఎస్ కుటుంబంలో చిచ్చు చెలరేగి, విజయమ్మ, షర్మిల వేరైపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి పార్టీ, అధికారాన్ని పక్కా కంట్రోల్ చేసుకునే వ్యక్తిగా భారతి మాత్రమే మిగిలిపోయారు. వైఎస్ఆర్‌సీపీలో భారతి జోక్యం కొత్త కాదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ వెనక నుంచి నడిపించినా, జగన్ జైలుకెళ్లే పరిస్థితి వస్తే ఇకపై అది ప్రత్యక్షంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే, “భారతి ప్రభావం పెరుగుతోంది” అని చెబుతున్న ప్రచారం కేవలం కొత్త చర్చ మాత్రమే కానీ, వాస్తవానికి పార్టీ కంట్రోల్ ఆమె చేతుల్లోనే ఉందనేది అందరికీ తెలిసిన నిజం.