ఎంతో ఉత్కంఠ భరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇక ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ఎంతో అగ్రసేన్ గానే కనిపిస్తూ ఉంటారు. ఎలాగైనా జట్టుకు విజయం అందించాలనే కసి ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే కొన్ని కొన్ని సార్లు ప్రత్యర్థులతో గొడవ పడటం లాంటివి కూడా చూస్తూ ఉంటారు. ఇక ఇలా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగిన గొడవలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఒకరిపై ఒకరు దూసుకు పోతూ ఉంటారు క్రికెటర్లు. ఇప్పటివరకు ఇలాంటివి ఎన్నో చూశామనే చెప్పాలి.


 ఇకపోతే ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వచ్చింది ఆస్ట్రేలియా జట్టు. ఈ క్రమంలోనే ఇక ఈ రెండు జట్ల మధ్య ప్రతి టెస్ట్ సిరీస్లో హోరాహోరీగా పోరు జరుగుతూ ఉండటం గమనార్హం.  ఈ క్రమంలోనే మూడో టెస్టులో మూడో రోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. షాహిన్ అఫ్రిది బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు.


 ఇక అంతలో ఊహించని ఘటన ఒక్కసారిగా షాహీన్ అఫ్రిది వార్నర్ మీదికి దూసుకుపోయాడు. దీంతో ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు అందరూ కూడా షాక్ అయ్యారు. కానీ అంతలో ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. షాహీన్ అఫ్రిది వేసిన ఒక ఓవర్ చివరి బంతి వార్నర్ డిఫెన్స్ ఆడాడు. ఇంతలోనే నాన్ స్ట్రైక్ లో ఉన్న కావజ పరుగులు చేసేందుకు ముందుకు వచ్చాడు. కానీ వార్నర్ మాత్రం నో రన్ అంటూ గట్టిగా అరిచాడు. ఇంతలో బంతి తీసుకోవడానికి వచ్చిన షాహీన్ అఫ్రిది వార్నర్ మీదికి దూసుకు పోయి సీరియస్ గా చూశాడు. ఇక వార్నర్ సైతం షాహీన్ అఫ్రిదిని అంతే సీరియస్ గా చూసాడు.  కానీ ఆ తర్వాత మాత్రం ఇద్దరూ నవ్వుకుని పక్కకు వెళ్లి పోయారు..

మరింత సమాచారం తెలుసుకోండి: