క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ కు ఎంతపేరు ఉందో తెలిసిందే. చిన్న వయసులోనే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో రికార్డులను తన పేరుపై రాసుకున్నాడు. ఇప్పటికీ తన పేరిట ఉన్న చాలా రికార్డులు పదిలంగా ఉన్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో గొప్ప క్రికెటర్లకు ఈయన సాధించిన రికార్డులను అధిగమించడం సాధ్యం కాలేదు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఫాస్ట్ క్రికెట్ కు అటు ప్రేక్షకులు ఇటు క్రికెటర్ లు బాగా  అలవాటు పడిపోయారు. దానితో టీ 20 లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకప్పుడు వన్ డే మ్యాచ్ లు ఏ విధంగా అయితే జరిగేవో అలా ఇప్పుడు టీ 20 లు జరుగుతున్నాయి. దానితో కొత్త కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టే సత్తా ఒక క్రికెటర్ కు ఉందని అంతటా చర్చ నడుస్తోంది. మరి ఆ క్రికెటర్ ఎవరు ? నిజంగా అతనికి అంత టాలెంట్ ఉందా? ఉంటే ఎంతకాలం లోపు సచిన్ రికార్డులను చేధించగలడు అన్న విషయం తెలుసుకుందాం.

ఇంగ్లాండ్ జట్టుకు మాజీ టెస్ట్ కెప్టెన్ మరియు అత్యుత్తమ బ్యాట్స్మన్ అయిన జో రూట్ గురించి తెలిసిందే. టెస్ట్ లలో మరియు వన్ డే లలో నిలకడగా రాణిస్తూ ఇంగ్లాండ్ టీం కు ఎన్నో విజయాలను అందిస్తున్నాడు. అయితే ఆస్ట్రేలియా తో జరిగిన యాషెస్ సిరీస్ లో దారుణ ఓటమికి బాధ్యత తీసుకుని టెస్ట్ కెప్టెన్ గా వైదొలిగాడు. అప్పటి నుండి రూట్ తన ఆటపై పూర్తి దృష్టిని కేంద్రీకరించి కొద్ది రోజుల ముందు కివీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి మం అఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఇక మొన్న జరిగిన గత సంవత్సరపు ఆఖరి టెస్ట్ లో సెంచరీ సాధించి సిరీస్ ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఇండియాతో జరిగిన ఈ సిరీస్ లో రూట్ 737 పరుగులు చేశాడు.


ఇతని కెరీర్ లో ప్రస్తుతం మొత్తం 28 టెస్ట్ సెంచరీలు ఉన్నాయి. ఇవి టెస్ట్ లలో అద్భుతంగా రాణిస్తున్న కోహ్లీ, స్టీవ్ స్మిత్ మరియు విలియం సన్ ల కన్నా ఎక్కువ. రూట్ ఇదే విధంగా మరో అయిదు సంవత్సరాలు రాణిస్తే సచిన్ నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డును తిరగరాస్తాడు అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. సచిన్ 200 టెస్ట్ లలో పరుగులు15921 చేయగా, రూట్ 121 టెస్ట్ లలో 10458 పరుగులు చేశాడు. కేవలం ఇంకో 5469 పరుగులు చేస్తే సచిన్ దాటేస్తాడు. ప్రస్తుతం రూట్ కు 31 సంవత్సరాలు, కనీసం ఇంకో 50 టెస్ట్ లు ఆది ప్రతి టెస్ట్ లోనూ సెంచరీ చేయగలిగితే రికార్డు అవుతుంది. మరి చేయగలడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: