బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ప్రతి ఏడాది ధోని సారథ్యంలో బరిలోకి  దిగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇక మొన్నటి వరకు సీనియర్ ఆటగాళ్లతో నిండి ఉండేది. అందుకే ఇక చెన్నై సూపర్ కింగ్స్ ని డాడీస్ ఆర్మీ అని కూడా పిలిచేవారు. ఇలా సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ యువకులకు పోటీ ఇస్తూ వరుసగా టైటిల్స్ గెలుచుకుంది చెన్నై జట్టు. అయితే ఇక ఇప్పుడు యువ ఆటగాళ్లతో జట్టును నింపేస్తున్నారు జట్టు యాజమాన్యం.


 చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడటానికి ఒక్కసారి ఛాన్స్ వచ్చిన కూడా చాలు అని ఎంతో మంది యువ ఆటగాళ్లు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో దిగజా కెప్టెన్ గా పేరు సంపాదించుకున్న మహేంద్రసింగ్ ధోని సారధ్యంలో ఒక్కసారి ఆడిన ఇక తమ కెరియర్ కు అదే అత్యుత్తమ అనుభవంగా మిగిలిపోతుందని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడే అవకాశం వస్తే వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు అని చెప్పాలి. అంతేకాదు ఇక సీఎస్కే యాజమాన్యం జట్టులో ఉన్న ఆటగాళ్లతో వ్యవహరించే తీరుపై కూడా ఎంతో సానుకూల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.


 కానీ మొదటిసారి ఐర్లాండ్ బౌలర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఐర్లాండ్ ఫేసర్ జోష్ లిటిల్ గత ఐపీఎల్ సీజన్ లో సీఎస్కే నెట్ బౌలర్గా ఎంపిక అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే యాజమాన్యం తనను సరిగ్గా ట్రీట్ చేయలేదని.. తానొక అంతర్జాతీయ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి కనీస మర్యాద కూడా ఇవ్వలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తనకు తుది జట్టలో అవకాశం కల్పిస్తామని చెప్పి.. కనీసం నెట్ బౌలర్గా కూడా తన సేవలను వినియోగించుకోలేదని చెప్పుకొచ్చాడు జోష్ లిటిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: