పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజి సినిమా సెప్టెంబర్ 25 వ తేదీన పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఆయన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందు రోజు అనగా సెప్టెంబర్ 24 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను చాలా ప్రాంతాల్లో ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్ షో లకు మంచి టాక్ వచ్చింది. అలాగే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు అనగా సెప్టెంబర్ 25 వ తేదీన కూడా మంచి టాక్ రావడంతో మంచి కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ సినిమా అలాగే చాలా రోజుల పాటు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది అని చాలా మంది అంచనా వేశారు.

కానీ ఈ మూవీ కి మొదటి రోజు వచ్చిన స్థాయి కలెక్షన్లు రెండవ రోజు నుండి రావడం లేదు. ఈ మూవీ కలెక్షన్లు చాలా వరకు తగ్గాయి. ఇకపోతే విడుదల అయిన మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన తెలుగు సినిమాల లిస్టులో ఓజి మూవీ మంచి స్థానం లోనే నిలిచిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఓజి సినిమా మూడవ రోజు కలెక్షన్లు మాత్రం వసూలు చేయలేక పోయింది. చిరంజీవి కొంత కాలం క్రితం వాల్టేరు వీరయ్య అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు విడుదల అయిన మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12.61 కోట్ల షేర్ కలక్షన్లు దక్కాయి. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజి మూవీ కి విడుదల అయిన మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.38 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దానితో విడుదల ఆయన మూడవ రోజు అత్యధిక కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన సినిమాల లిస్టులో చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ ని పవన్ నటించిన ఓజి మూవీ దాటలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: