ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే . ఇక భారత పర్యటనలో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు అటు మరింత పటిష్టంగా ఉండే భారత జట్టును ఓడించేందుకు మాత్రం సర్వశక్తులు ఓడ్డాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇక భారత్లో ఉన్న స్పిన్ పిచ్ లపై ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఎక్కడ ప్రభావం చూపలేకపోతున్నారు.


 భారత స్పిన్నర్ల దెబ్బకు చేతులెత్తేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా భారత్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ లు ముగిసాయి. మొదటి మ్యాచ్ లో 132 పరుగులు తేడాతో విజయం సాధించిన టీమిండియా రెండవ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇకపోతే ఇలా రెండు మ్యాచ్లలో గెలిచి కూడా 2-0 తేడాతో ఆదిక్యంలో  కొనసాగుతుంది టీమిండియా. ఇక నేటి నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇండోర్ లోనే హోల్ కల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే మూడో టెస్ట్ మ్యాచ్లో గెలిస్తే ఇక టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంటుంది.


 అంతేకాకుండా ఇక నేరుగా అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అడుగుపెడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పటికే రెండు మ్యాచ్లలో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు మూడో మ్యాచ్లో గెలిచి ఎట్టి పరిస్థితుల్లో సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తుంది. అదే సమయంలో బోర్డర్ గవాస్కర్  ట్రోఫీలో మూడో టెస్టులో విజయం ద్వారా బోనీ కొట్టాలని భావిస్తూ ఉంది అని చెప్పాలి. దీంతో ఇక ఈ టెస్ట్ మ్యాచ్ జరగడం ఖాయం అన్నది తెలుస్తూ ఉంది. మరి ఈ మూడో టెస్టులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: