ఇటీవలే ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య జరిగిన మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ సృష్టించిన బ్యాటింగ్ విధ్వంసం గురించి ప్రేక్షకులు మర్చిపోలేక  పోతున్నారు అని చెప్పాలి. 35 బంతుల్లోనే ఏకంగా 83 పరుగులు చేసి వీర విహారం చేశాడు సూర్య కుమార్ యాదవ్. ఒక రకంగా చెప్పాలంటే అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేసిన 200 పరుగుల లక్ష్యం సూర్య కుమార్ విధ్వంసం ముందు చిన్న బోయింది అని చెప్పాలి. కీలక సమయం లో టాపార్డర్ కుప్పకూలిన... సూర్య కుమార్ మాత్రం చెలరేగి ఆడాడు.



 ఈ క్రమం లోనే మిస్టర్ 360 ప్లేయర్ అనే బిరుదును సార్ధకం చేసే విధంగా అతని బ్యాటింగ్ సాగింది. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. వెనుక కీపర్ మీదుగా బౌండరీలు బాధటం పై సూర్య కుమార్ యాదవ్ స్పందించాడు.  ఈ క్రమం  లోనే వ్యాఖ్యత మంజ్రేకర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు. పక్క ప్రణాళికతో అద్భుతమైన టైమింగ్ తో ఖాళీ ప్రదేశాలలో ఎలా షాట్లు కొట్టగలవు అంటూ మంజ్రేకర్ ప్రశ్నించాడు.



 ఇక ఈ ప్రశ్నకు సూర్య కుమార్ యాదవ్ సమాధానం చెబుతూ మ్యాచ్ లో ఏం చేయాలి అని అనుకుంటానో.. దానిని ప్రాక్టీస్ సెషన్ లోనే అమలు చేస్తాను. ఫీల్డర్లను అలాగే సెట్ చేసుకొని మరీ ప్రాక్టీస్ చేస్తాను. ఇక ఫిల్టర్లు ఉన్నచోట కాకుండా ఖాళీ ప్రదేశంలో ఎలా బంతిని తరలించాలి అనే విషయంపై కఠినమైన ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. నాపై నేను తీవ్రమైన ఒత్తిడి పెట్టుకొని మరి సాధన చేస్తాను. ఇక నేను మైదానంలో ఎక్కడి నుంచి పరుగులు రాబట్టగలను. నాకు తెలుసు అందుకు తగ్గట్టుగానే నా ప్రాక్టీస్ కూడా ఉంటుంది అంటూ సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: