రాజకీయాల్లో సర్పంచ్ పదవి వచ్చినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినట్టు పోజు కొట్టే మొనగాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ మంత్రి పదవి వచ్చినా ఊరి సర్పంచ్‌ గా ఫీలయ్యే సింప్లిసిటీ చూపించే వాళ్లు చాలా అరుదు.. అలాంటి వారిలో పేర్ని నాని ఒకరు. ఆయన జగన్ మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రి.. మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రిపదవి ఉంది కదా అని దర్పం చూపించడం పేర్ని నాని చరిత్రలోనే ఉండదు.

 

 

మీడియాతో చాలా ఫ్రెండ్లీగా కలసిపోతారు. మీడియా అనే కాదు.. జనంలోనూ అంతే. తాజాగా పేర్ని నాని.. మచిలీపట్నంలో పర్యటించారు. ఈ ప్రాంతాన్ని కరోనా రెడ్‌ జోన్ గా ప్రకటించడంతో పారిశుధ్యంపై మరింతగా దృష్టి పెట్టారు. మంత్రి పేర్ని నాని స్వయంగా రంగంలోకి దిగి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలోనే కరోనా విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఒకరు, మంత్రి పేర్ని నానికి ఆత్మీయంగా ఆహారం తినిపించారు.

 

 

మంత్రే అయిన పేర్ని నాని ఓ బెంచ్ పై కూర్చుని భోజనం చేశారు. ఇంటి నుంచి వచ్చిన క్యారేజీని విధినిర్వహణలో ఉన్న పోలీసుల ముందే ఓపెన్ చేసి భోంచేశారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న కానిస్టేబుల్ కూడా బాక్సు ఓపెన్ చేశారు. కరోనాపై చేస్తున్న పోరులో కలిసిన ఒక మంత్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ హద్దులు మరిచి, తమకున్న స్థాయి భేదాలను పక్కనబెట్టి, ఆత్మీయంగా ఆహారాన్ని తినిపించుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

ఉమ్మడి పోరులో మిత్రులే తప్ప శత్రువులు ఉండరని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. ఇలా డౌన్ టు ఎర్త్ ప్రవర్తించడం పేర్ని నానికి కొత్తేమీ కాదు. ఆయన పనుల్లోనే కాదు. ఆయన మాటల్లోనూ అదే సింప్లిసిటీ ఉంటుంది. అందులో కాస్త మిరపకాయంత ఘాటు, వ్యంగ్యం కూడా ఉంటాయనుకోండి. ఏదేమైనా.. ఈ ప్రభుత్వం మాది.. ఈ పాలన మాది అని జనం ఫీలవ్వాలంటే పేర్ని నాని లాంటి మంత్రులు ఉండాలబ్బా.. ఏమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి: