దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కో రోజు.. ఒక్కో అలంకారంలో ఉంటారన్న సంగతి తెలిసిందే. అమ్మవారి అష్టమినాటి అలంకారం మహా దుర్గ, కనకదుర్గ. దుర్గ అంటే దుర్గతినితొలగించేది.


ఇక్కడ దుర్గతి అంటే అజ్ఞానం అని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అజ్ఞానం నుంచి అరిషడ్వర్గాలు పుడతాయి. వాటికి లోబడి ప్రవర్తించే గుణాన్ని నశింపజేసేది దుర్గావతారం. చేరుకోవడానికి శక్యంకాని లక్ష్యాన్ని చేరువ చేసేది అమ్మవారు దుర్గ. మనిషి మనసులో ఉండేదుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి లక్ష్యాన్ని సుగమం చేసేది దుర్గమ్మే.


ఇక అమ్మవారి నవమినాటి అలంకారం మహిషాసురమర్దిని. మహిషమంటే దున్నపోతు. ఆ లక్షణాలు కలిగి ఉండటం మహిషాసురత్వం. ఇది అచ్చమైన తమోగుణం. అలసత్వం, నిద్ర, బద్దకం, హింస, క్రౌర్యం మొదలైన తమోగుణ లక్షణాల్ని మర్దింపచేసేది మహిషాసురమర్దిని.


ప్రస్తుత సమాజంలో కంఠదఘ్నంగా ఉన్న ఈ లక్షణాలను ఈ రూపంలోని అమ్మను ఆరాధించడం ద్వారా అంటే అమ్మతత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా తొలగించుకోవచ్చు.ఎప్పుడైతే మానవ స్వభావంలో ఉన్న మహిషాసురుని సంహారం జరుగుతుందోఆ వెంటనే వచ్చేది విజయమే అన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: