ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే... ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో ఉన్న స్టీవ్ స్మిత్ భారత జట్టు బౌలలు ర్ అందరికీ కొరకరాని కొయ్యగా మారిపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అద్భుత ఫామ్ లో  ఉన్న స్మిత్ పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే రానున్న టెస్టు సిరీస్ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మంచి ఫామ్ లో  ఉన్న స్మిత్ ను  తొందరగా అవుట్ చేస్తేనే భారత్కు మంచి ఫలితం ఉండేందుకు అవకాశం ఉంటుంది అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.



 డిసెంబర్ 17 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్  సిరీస్ లకు సంబంధించిన టెస్ట్ మ్యాచ్ లు ప్రారంభం కానున్న అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో బ్యాటింగ్లో ప్రస్తుతం  స్మిత్ నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే స్మిత్ భారత జట్టుకు టెస్టు సిరీస్లో ఎంతో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని స్మిత్ టికెట్ ఎంత తొందరగా పడగొడితే అంత ప్రయోజనం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.



 స్మిత్ గురించి సచిన్ చేసిన వ్యాఖ్యలను కూడా తాను సమర్థిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. స్మిత్  ఆడిన తొలి 20 బంతుల్లోనే అతడిని అవుట్ చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆ తర్వాత అతనికి అవుట్ చేయడం కష్టతరంగా మారుతుంది అంటూ అంటూ చెప్పుకొచ్చాడు. దిగ్గజ బ్యాట్స్మెన్ ఫామ్ లో  ఉంటే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతే  కాకుండా స్మిత్ విషయంలో స్టాంప్ లైన్ బౌలింగ్ చేస్తే అతడు వికెట్ సమర్పించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ క్లార్క్.

మరింత సమాచారం తెలుసుకోండి: