ఇటీవలే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ లో  అద్భుత విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తక్కువ బలం తో బరిలోకి దిగిన భారత జట్టు అద్భుతంగా రాణించి దిగ్గజ జట్టుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించి భారత క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ సాధ్యం కాని రీతిలో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది అనే విషయం తెలిసిందే.  భారత జట్టు సాధించిన చారిత్రాత్మక విజయం ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంది.



 ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు భారత జట్టు విజయం పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గాయాల బెడద వేధిస్తున్నప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయకుండా నిరుత్సాహపడకుండా వీరోచిత పోరాటం చేసి.. టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు. భారత జట్టు ప్రదర్శన తీరు అసామాన్యమైనది అంటూ భారత మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టును తక్కువ అంచనా వేశామని అటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా వ్యాఖ్యానిస్తూ ఉండటం గమనార్హం. ఒక ఇటీవలే ఆస్ట్రేలియా బౌలర్ షేన్ వార్న్ భారత్ విజయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 భారత జట్టు చేతిలో ఓడిపోవడం తమకు పూడ్చ  లేని లోటును మిగిల్చింది అంటూ ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ వ్యాఖ్యానించాడు. పూర్తి సామర్థ్యంతో ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగినప్పటికి కూడా తక్కువ బలంతో బరిలోకి దిగిన భారత జట్టు చేతిలో ఓడిపోవడం ఎంతగానో కలిచివేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఓటమిపై ఆస్ట్రేలియా వ్యూహాలు, జట్టును ప్రశ్నించగా తప్పదు. ముఖ్యంగా ప్రతి బౌలర్ కూడా సమాధానం చెప్పాల్సిందే.  భారత్ అద్భుతంగా ఆడింది అని చెప్పి వాళ్లు తప్పించుకోలేరు అంటూ షేర్ వార్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: