మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం జరగబోతుంది. ఇక ఈ మెగా వేలం తర్వాత వెంటనే ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించేందుకు బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అనుకున్న సమయానికి కఠిన నిబంధనల మధ్య ఐపీఎల్ నిర్వహించేందుకు ఇప్పటికే ప్లాన్ల సిద్ధం చేసింది బీసీసీఐ. పక్కా ప్లాన్ ప్రకారమే ఎలాంటి  ఇబ్బందులు తలెత్తకుండా ఐపీఎల్ నిర్వహించబోతున్నారు. అయితే ఐపీఎల్ నిర్వహణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో ఎవరు ఊహించని ఘటన చోటు చేసుకుంది.



 దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి ఐపీఎల్ స్పాన్సర్ గా కొనసాగుతున్న చైనా మొబైల్ సంస్థ వివో ఇటీవలే ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా మొబైల్ కంపెనీ వివో ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి పూర్తిగా తప్పుకుంటుంది అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఐపీఎల్ స్పాన్సర్ గా కొనసాగింది వివో. అయితే ఇక ఇప్పుడు మరో రెండేళ్లు గడువు ఉన్నప్పటికీ నాటకీయ పరిణామాల మధ్య ప్రస్తుతం చైనా మొబైల్ సంస్థ వివో ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.



 దీంతో ప్రపంచ క్రికెట్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన దేశీయా లీగ్ గా గుర్తింపు సంపాదించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్ షిప్ ను దేశీయ వ్యాపార దిగ్గజం టాటా సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా వెల్లడించడం గమనార్హం. ఈ ఏడాది తో పాటు 2023 ఐపీఎల్ సీజన్ కూడా దేశీయ వ్యాపార సంస్థ టాటా టైటిల్ స్పాన్సర్షిప్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయాన్ని ఐపిఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. అయితే 2020 సంవత్సరం లో వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి తొలగించ బడింది.  ఇక ఆ సమయంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా డ్రీం 11  వ్యవహరించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl