గత కొంత కాలం నుంచి వృద్ధిమాన్ సాహా వ్యవహారం అటు భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన వృద్ధిమాన్ సాహా పేలవమైన ఫామ్ కారణంగా అటు భారత జట్టుకు దూరమయ్యాడు. అదే సమయంలో అతన్ని ఒక జర్నలిస్టు బెదిరించాడు అంటూ ఆరోపణలు చేయడం.. దానిపై బిసిసిఐ విచారణ జరపడం తో కొన్నాళ్ల పాటు అతని పేరు వార్తల్లో నిలిచింది. ఇక ఇటీవలే రంజీ ట్రోఫీలో భాగంగా వృద్ధిమాన్ సాహా తీసుకున్న నిర్ణయంతో అభిమానులు అందరూ షాక్ అయ్యారు.



 పలు కారణాల వల్ల ఏకంగా బెంగాల్ జట్టు తో ఉన్న సంబంధాలను తెంచుకునేందుకు సిద్ధమయ్యాడు వృద్ధిమాన్ సాహా. ఈ నేపథ్యంలో త్రిపుర జట్టు తరఫున ఆడబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో వృద్ధిమాన్ సాహా అడుగులు ఎటు వైపు వెయ్యబోతున్నాడు అన్నదానిపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది అని చెప్పాలి. అయితే వృద్ధిమాన్ సాహా కొత్త అవతారం ఎత్తపోతున్నాడు అన్నది తెలుస్తుంది. త్రిపుర జట్టు తరఫున ఒక ఆటగాడిగా కొనసాగడంతో పాటు ఆ జట్టుకు కెప్టెన్గా కూడా మారబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం రానున్న రోజుల్లో తెలియ నుంది.


 ఇకపోతే టీమిండియాకు దూరమైన వృద్ధిమాన్ సాహా అంకిత భావాన్ని బెంగాల్ జట్టు క్యాంప్ సంయుక్త కార్యదర్శి దెబబ్రత ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే  దెబబ్రత తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన వృద్ధిమాన్ సాహా బెంగాల్ జట్టు తరఫున బరిలోకి దిగలేదు. అయితే తనను సంప్రదించకుండానే క్వార్టర్స్ ఆడబోయే జట్టులో తన పేరును చేర్చారని దీనిపై తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వృద్ధిమాన్ సాహా. చివరికి బెంగాల్ జట్టును వీడాడు. కాగా ఇక ఇటీవలే అటు గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఐపీఎల్ లో అవకాశం దక్కించుకున్న ఈ సీనియర్ ప్లేయర్ అటు ఐపీఎల్ లో తనదైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: