భారత్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా క్రికెట్ రంగాన్నే తన లక్ష్యంగా ఎంచుకున్న విషయం తెలిసిందే. క్రికెట్ దిగ్గజం సచిన్ దగ్గర బాగా ట్రైన్ అప్ అయిన ఈ యంగ్ క్రికెటర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ జట్టులో కూడా భాగం అయిన విషయం క్రికెట్ ప్రేమికులకు తెలిసిందే. అయితే సీజన్ మొత్తం అర్జున్ కి ఐపీఎల్ లో ఒక మ్యాచ్ కూడా ఆడడానికి అవకాశం రాలేదు. ముంబై ప్లే ఆఫ్ కు వెళ్లాడని తెలిసినా, జట్టు అతన్ని అందించకపోవడం మరీ దారుణమా అని చెప్పాలి. ఈ విషయంపై సచిన్ అభిమానులు రోహిత్ శర్మపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక మరి కొందరు అయితే అర్జున్ టెండూల్కర్ క్రికెటర్ గా  రాణించగలడా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మెగా క్రికెటర్ సచిన్ తనయుడు తండ్రి బాటలో నడవాలని ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కేలా లేదని కొందరు అంటున్నారు. కానీ సచిన్ అభిమానులు మాత్రం చెట్టు ఒకటి అయితే విత్తు మరొకటి అవదని కాస్త లేట్ అయినా సరే అర్జున్ క్రికెట్ ఫీల్డ్ లోనే సెటిల్ అవుతాడని తండ్రి తగ్గ తనయుడిగా ఆదర్శంగా నిలుస్తారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అటుంచితే తాజాగా అర్జున్ టెండూల్కర్అమ్మాయి తో డిన్నర్ కి వెళ్ళడం హాట్ టాపిక్ గా మారింది.

అవును అర్జున్ఇంగ్లాండ్ క్రికెటర్ తో డిన్నర్ కి వెళ్లగా ఆ అకేషన్ కి సంబందించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ ఇంగ్లండ్ లో ఉన్నాడు. అయితే  ఇక్కడ అతను ఇంగ్లాండ్ యువ క్రికెటర్ డానియల్ వ్యాట్ తో కలిసి డిన్నర్ చేశాడు. దీనితో వీరిద్దరిపై ట్రోల్స్ నడుస్తున్నాయి. అయితే వీరు చిన్నప్పటి నుండి స్నేహితులని తెలుస్తోంది. కొంపదీసి అర్జున్ టెండూల్కర్ ఈమె ప్రేమలో పడ్డాడా అంటూ వార్తలు వెల్లువెత్తుత్తున్నాయి. మరి పోను పోను వీరి స్నేహం దేనికి దారి తీస్తుందో చూడాలి.మరింత సమాచారం తెలుసుకోండి: