బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంతో గుర్తింపు ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగానే అటు ప్రపంచ క్రికెట్లో టి20 ఫార్మర్ కి కూడా ఊహించని రీతిలో క్రేజ్ పెరిగిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే మిగతా దేశాలు కూడా దేశీయ టీ20 లీగ్ లను నిర్వహిస్తూ ఉండటం గమనార్హం. కాగా దక్షిణాఫ్రికాలో కూడా కొత్త టీ20 లీగ్ ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్ ప్రభావం ఇక ఈ టి 20 లీగ్ పై స్పష్టంగా  కనిపిస్తుంది అని చెప్పాలి.


 అంతేకాదండోయ్ ఐపీఎల్‌తో అనుబంధమున్న ఫ్రాంచైజీలు తమ కొత్త జట్లను ఏర్పాటు చేసుకున్నాయి అని చెప్పాలి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ సహా ఆరు జట్లు ఈ జాబితాలో ఉన్నాయి.ఈ క్రమంలోనే ఇక దక్షిణాఫ్రికాలో ప్రారంభం కాబోతున్న టి20 లీగ్ లో ఐపీఎల్లో బాగా రాణించిన కీలకమైన సార్లు కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అయినా జోహన్నెస్‌బర్గ్ సుపరిచితమైన ఆటగాళ్లను  చూడవచ్చు అని తెలుస్తోంది.


 చెన్నై సూపర్ కింగ్స్ కి ఎన్నో ఏళ్ల పాటు ఆడిన డుప్లెసిస్  చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ జట్టు జోహెన్నెస్‌బర్గ్   కెప్టెన్ గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. చెన్నై ఆటగాడు మోయిన్ అలీని కూడా చేర్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత జట్టులోకి ఇంకెవరూ వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా చెన్నై ఆటగాళ్లు జట్టు లో చేరిన సమయంలో ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జోహన్నెస్‌బర్గ్ జట్టుకు మెంటార్ గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: