ఆసియా కప్ లో భాగంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా మరింత రసవత్తరంగా మారిపోయింది అని చెప్పాలి. నిన్నటి వరకు లీగ్ దశలో విజయాల కోసం పోరాడిన జట్లు ఇప్పుడు ఫైనల్లోకి అడుగుపెట్టి హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే  నేడు మరో ఆసక్తికరమైన పోరు జరుగుతుంది అని చెప్పాలి. ఆసియా కప్లో భాగంగా టీమిండియా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే పాకిస్తాన్పై వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి సూపర్ 4లో అడుగుపెట్టింది టీమిండియా.


 కాని సూపర్ 4లో భాగంగా జరిగిన కీలకమైన మ్యాచ్లో టీమిండియా విజయాలకు బ్రేక్ పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది టీమిండియా.  అయితే ప్రస్తుతం టీమిండియా వరుసగా రెండు మ్యాచ్ లు ఆడబోతుంది. ఈ క్రమంలోనే రెండు మ్యాచ్ లలో కూడా చావో రేవో తేల్చుకో పోతుంది అని చెప్పాలి. ఇందులో భాగంగానే  నేడు శ్రీలంక తో మ్యాచ్ జరగబోతోంది. ఇక టీమిండియా ఫైనల్ కు వెళ్లాలి అంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి   ఉంది. అది కూడా భారీ తేడాతో.


 ఇలా నేడు జరగబోయే శ్రీలంక తో టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతో బలహీనంగా ఉన్న శ్రీలంక జట్టుపై విజయం సాధించి  ఫైనల్ రేసులు  నిలవాలని దృఢ సంకల్పంతో ఉంది టీమిండియా. మరి నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.అయితే శ్రీలంకతో మ్యాచ్లో పలువురు ఆటగాళ్లు కూడా జట్టులోకి తీసుకుని కొంత మందికి రెస్టు ఇచ్చే అవకాశం ఉంది అన్న కూడా టాక్ వినిపిస్తోంది. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: