ఒకప్పుడు పరుగుల వీరుడుగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత కాలంలో సారథిగా కూడా అంతకుమించి అనే రేంజ్ లోనే గుర్తింపు సంపాదించుకున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. అంతేకాదు జట్టులో విరాట్ కోహ్లీ తర్వాత సీనియర్ ఆటగాడు కూడా రోహిత్ శర్మ కావడంతో ఇక కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోగానే రోహిత్ శర్మకు సారధ్య బాధ్యతలు అప్పగించారు టీమిండియా యాజమాన్యం.


 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తనతైన వ్యూహాలతో ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ సూపర్ సక్సెస్ అవుతూ వరుస విజయాలతో మూసుకుపోతున్నాడు అని చెప్పాలి. అయితే రోహిత్ శర్మ కెప్టెన్ గా సక్సెస్ అవుతున్నప్పటికీ బ్యాట్స్మెన్ గా మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఒకప్పుడు పరుగులు చేసి రికార్డులు కొల్లగొట్టిన రోహిత్ శర్మ ఇక ఇప్పుడు మాత్రం చెత్త రికార్డులను ఖాతాలో వేసుకుంటూ ఉన్నాడు. రోహిత్ శర్మ బ్యాట్ నుండి ఎప్పుడో ఒకసారి మాత్రమే మంచి ప్రదర్శన వస్తుంది అని చెప్పాలి.



 ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మూడవ టి20 మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ మరోసారి డకౌట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. పరుగులు ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరాడు. దీంతో ఒక చెత్త రికార్డు రోహిత్ శర్మ ఖాతాలో వచ్చి చేరిపోయింది. టి20 క్రికెట్ లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్స్ స్కోర్ కే అవుట్ అయిన ప్లేయర్గా నిలిచాడు రోహిత్ శర్మ. మొన్నటి వరకు 42 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే  అవుట్ అయిన బ్యాట్స్మెన్ గా ఐర్లాండ్  మాజీ ప్లేయర్ ఓబ్రేయిన్ పేరుట చెత్త రికార్డు ఉండేది. కానీ ఇటీవల రోహిత్ శర్మ 43 సార్లుసింగిల్ డిజిట్ స్కోర్ కే ఔట్ అయ్యి చేత రికార్డును అధిగమించాడు.. వరల్డ్ కప్ ముందు రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ అటు అభిమానులను ఆందోళన కలిగిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: