టీమిండియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు రవీంద్ర జడేజా. తనదైన ఆట తీరుతో తన స్థానాన్ని జట్టులో సుస్థిరం  చేసుకున్నాడు అని చెప్పాలి  అయితే గత కొంతకాలం క్రితం మోకాలీ గాయం బారిన పడిన రవీంద్ర జడేజా జట్టుకు దూరమయ్యాడు. అయితే ఇక బంగ్లాదేశ్ తో సిరీస్లో రవీంద్ర జడేజా ను జట్టులో ఎంపిక చేసినప్పటికీ ఇక అతను మోకాలీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు అన్న కారణంతో జట్టు నుంచి అతని పేరును తప్పించారు  అయితే ఇక మొన్నటి వరకు గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో పాల్గొన్నాడు.


 రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కు బిజెపి నుంచి ఎమ్మెల్యే టికెట్ రావడంతో ఇక జామ్ నగర్ నుంచి ఆమె పోటీ చేశారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఆమె తరఫున జడేజా ప్రచారంలో పాల్గొన్నాడు. అదే సమయంలో ఇక రవీంద్ర జడేజా సోదరి నయానాభ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఈ క్రమంలోనే ఇక సోదరికి మద్దతుగా అటు కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ప్రచారం చేశారు రవీంద్ర జడేజా. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా తీరును ఉద్దేశిస్తూ ఇటీవల ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భవిష్యత్తులో తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతాడు అంటూ తనదైన శైలిలో సెటైర్లు పేల్చాడు కునాల్ కామ్రా. ప్రస్తుతం బిజెపి తరఫున భార్య కోసం ప్రచారం చేస్తున్నాడు. మరోవైపు సోదరి కోసం కాంగ్రెస్ తరపున కూడా ప్రచారంలో పాల్గొంటున్నాడు  కానీ చివరికి జడేజా అమ్ ఆద్మీ పార్టీలో చేరుతాడు అంటూ సెటైర్లు వేశాడు. అయితే ఇక ఈ కామెంట్ చూసి కొంతమంది జడేజా అభిమానులు స్పోర్టివ్ గా తీసుకొని నవ్వుకుంటూ ఉంటే.. మరి కొంతమంది మాత్రం మా అభిమాన ఆటగాన్ని ఇలా ఎలా అంటారు అంటూ కునాల్ కామ్రా పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి: