
అయితే రెండో వన్డే మ్యాచ్లో కూడా విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తుంది టీమ్ ఇండియా. అటు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో మ్యాజిక్ నే అటు న్యూజిలాండ్ తో సిరీస్ లో కూడా రిపీట్ చేయాలని భావిస్తూ ఉంది. అదే సమయంలో ఇక అటు న్యూజిలాండ్ జట్టు సైతం సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకునేందుకు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే మొదటి వన్డే మ్యాచ్లో తుది జట్టులో చోటుక దక్కించుకోలేకపోయినా ఉమ్రాన్ మాలిక్ కు అటు రెండవ వన్డేలో కూడా చోటు కష్టమే అంటూ భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.
ఎందుకంటే జట్టుకు ఆల్రౌండర్ల అవసరమే ఎక్కువగా ఉంది అంటూ తెలిపాడు. నాకు తెలిసి ఉమ్రాన్ ఖాన్ కు రెండో మ్యాచ్ లో కూడా ఛాన్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ జట్టులోకి వచ్చిన అది ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో వస్తాడని మాత్రం నేను అస్సలు అనుకోను. ఇక నా అభిప్రాయం ప్రకారం అయితే ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న శార్దూల్ ఠాగూర్ భారత జట్టులో ఉండడం ఎంతో ముఖ్యం. ఎందుకు అంటే అతను ఉన్నాడు అంటే ఎనిమిదవ స్థానంలో కూడా భారత బ్యాటింగ్ అయిన బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది జట్టుకు ఎంతో అవసరం. గత మ్యాచ్లో అతడు బాగానే బౌలింగ్ చేశాడు అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. బంతితోనే కాదు బ్యాట్ తోను రానించగలడు అంటూ తెలిపాడు.