క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య పోరు నేటినుంచి ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ సిరీస్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. అయితే అటు భారత్లో ఉన్న టర్నింగ్ పిచ్ లపై స్పిన్నర్లతో ఆస్ట్రేలియాపై అటాక్ చేయడానికి అటు భారత జట్టు కూడా సిద్ధమైంది. అదే సమయంలో ఇక భారత స్పిన్నర్లను ఎదుర్కొని క్రీజులో నిలదొక్కుకోవడానికి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు కూడా తీవ్రంగానే ప్రాక్టీస్ చేశారు అని చెప్పాలి.


 అయితే రోజు చదివేవాడు కాదు ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు అన్న విధంగా.. ప్రాక్టీస్ లో ఎంతలా శ్రమించినప్పటికీ అటు అఫీషియల్ మ్యాచ్లో నిలదొక్కుకొని భారీగా పరుగులు చేసినప్పుడే ఆటగాడు చివరికి హీరోగా మారి ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. దీంతో ఇక ఎవరు ఇలా ఈ సీజన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హీరోగా మారతారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ అటు ఆస్ట్రేలియా బౌలర్లకు పెద్ద సవాలుగా మారే ఛాన్స్ ఉంది అని ఎంతో మంది ఆస్ట్రేలియా మాజీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రేగ్ చాపెల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. మొదటి టెస్ట్ మ్యాచ్ కి ముందు ఆస్ట్రేలియా ప్లేయర్లందరికీ కూడా పలు సూచనలు ఇచ్చాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై బాగా రాణించడానికి ప్రయత్నాలు చేస్తాడు అంటూ గ్రేగ్ చాపెల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక విరాట్ కోహ్లీని పెద్ద స్కోరు చేయకుండా అడ్డుకుంటే అటు టీమ్ ఇండియాకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక అతని వికెట్ కోసం ప్రత్యేకమైన ప్రణాళికలతో బరిలోకి దిగాలి అంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: