చెన్నైలోని చపాక్ స్టేడియం అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి హోం గ్రౌండ్ గా కొనసాగుతుంది. అయితే ఈ హోం గ్రౌండ్ లోనే ఇటీవలే లక్నోతో మ్యాచ్ ఆడింది చెన్నై జట్టు. అందరూ ఊహించినట్లుగానే ఇక సొంత ప్రేక్షకుల మధ్య ఘన విజయాన్ని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అని చెప్పాలి. బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో అద్భుతంగా రానించి ఇక ప్రత్యర్థి పై 12 పరుగులు తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. అయితే అంతకు ముందు జరిగిన మొదటి మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగిపోయిన రుతురాజు గైక్వాడ్  ఇక ఇటీవలే లక్నోతో మ్యాచ్లో కూడా మరోసారి తన అద్భుతమైన ఫామ్ కనబరిచాడు.



 అదే సమయంలో మొదటి మ్యాచ్ లో తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయి నిరాశపరిచిన డేవాన్ కాన్వే అటు రెండో మ్యాచ్లో మాత్రం మంచి ప్రదర్శన చేశాడు అని చెప్పాలి.. ఇక వీరిద్దరూ కూడా ఒక వికెట్ పడకుండానే 100 పరుగుల కంటే ఎక్కువ భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు అని చెప్పాలి. దీంతో ఇక వీరిద్దరిని అవుట్ చేయడం అటు ప్రత్యర్ధి లక్నో బౌలర్లకు సవాల్గా మారిపోయింది. ఇక వీరిద్దరూ కూడా తొలి వికెట్ కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఈ ఓపెనింగ్ జోడి ఒక అరుదైన ఘనతను కూడా సాధించింది అని చెప్పాలి.



 ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా ఈ ఓపెనింగ్ జోడి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు వీరిద్దరూ మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు అని చెప్పాలి. ఇక ఇంతకుముందు ఈ రికార్డు మురళి విజయ్, మైకల్ హస్సి పేరిట ఉండేది. కాగా వారి ఓపెనింగ్ జోడి రెండు సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయగా.. ఇక ఇటీవలే లక్నోతో జరిగిన మ్యాచ్లో 110 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఋతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే ఈ రికార్డును బ్రేక్ చేశారు అని చెప్పాలి. కాగా ఈ మ్యాచ్లో రుతురాజు గైక్వాడ్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకోగా.. మరోవైపు డేవన్ కాన్వే  29 బంతుల్లో 47 పరుగులు చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl