
ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంగ్లాండులోని ఓవల్ మైదానం వేదికగా జరగబోతుంది. అయితే ఇప్పటికే ఇంగ్లాండు గడ్డపై అడుగుపెట్టిన ఇరుజట్ల ఆటగాళ్లు అక్కడ ప్రాక్టీస్ లో మునిగితేలుతున్నారు అని చెప్పాలి. ఇక అదే సమయంలో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి ఇరు జట్లు. ఇక ప్రస్తుతం ఇదే విషయంపై అటు అంతర్జాతీయ క్రికెట్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఏదైనా కీలక మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఎంతో మంది మాజీ ప్లేయర్లు తమ ప్లేయింగ్ ఎలివెన్ జట్టును ప్రకటించడం ఇటీవల కాలంలో ట్రెండ్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసి ఫైనల్ నేపథ్యంలో ఎంతో మంది ప్లేయర్స్ ప్లేయింగ్ జట్టును ప్రకటిస్తున్నారు.
ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత జట్టు మాజీ కోచ్ టామ్ మూడి స్పందిస్తూ.. డబ్ల్యూటీసి ఫైనల్ కోసం తన ప్లేయింగ్ జట్టును ప్రకటించాడు. ఇక ఆ వివరాలు చూసుకుంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్, పూజార, విరాట్ కోహ్లీ, అజింక్య రహనే, కె ఎస్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాగూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవులకు తన ప్లేయింగ్ ఎలెవెన్ జట్టులో చోటు కల్పించాడు టామ్ మూడి. ఇక ఈ ఆటగాళ్లతో టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్లో బరిలో కి దిగితే తప్పక విజయం సాధిస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు అని చెప్పాలి.