కానీ రవీంద్ర జడేజా పెట్టిన ఒక పోస్ట్ కారణంగా చివరికి ధోని అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. కానీ ఆ తర్వాత ఫైనల్లో విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత ధోని కోసం ఏమైనా చేస్తాను అంటూ వ్యాఖ్యానించడంతో ఇక ధోని అభిమానులందరూ కూడా కూల్ అయ్యారు. అయితే ఇక ఈ వివాదం గురించి ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవీంద్ర జడేజా మ్యాచ్ ముగింపు సమయంలో బ్యాటింగ్ చేయడానికి వస్తాడు. అతను వచ్చిన సమయంలో 7, 8 బంతులు మాత్రమే ఉంటాయి. వాటిని షాట్లు కొట్టడానికి ప్రయత్నిస్తాడు లేదంటే వదిలేస్తాడు.
అతని తర్వాత ధోని బ్యాటింగ్ కి వస్తాడు అన్న విషయం జడేజాకు తెలుసు. అయితే ధోని మైదానంలోకి రాగానే అభిమానులు ధోని నామస్మరణ మొదలుపెడతారు. కొన్ని కొన్నిసార్లు జడేజా తొందరగా అవుట్ అయితే ధోని వస్తాడు అని నినాదాలు చేయడం కూడా చేస్తూ ఉంటారు. అయితే బహుశా ఈ విషయం జడేజా మనసును గాయపరిచి ఉండొచ్చు. అలాంటి సమయంలో ఏ ఆటగాడు అయినా ఫీల్ అవుతాడు. ఒత్తిడిలో కూరుకుపోతాడు. కానీ జడేజా మాత్రం ఒక్కసారి కూడా ఈ విషయంపై మాకు కంప్లైంట్ చేయలేదు అంటూ కాశివిశ్వనాధ్ చెప్పుకొచ్చాడు. కాదా రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత ధోని ఏకంగా జడేజాను ఎత్తుకొని ఎమోషనల్ అయ్యాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి