బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత ఎక్కువగా ప్రేక్షకాదరన  కలిగిన టీం ఏది అంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అని చెప్పాలి. మొదటి నుంచి కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఐపీఎల్ లో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు.. ఇక ఆ తర్వాత అంతకుమించి అనే రేంజ్ లోనే పాపులారిటీని సంపాదించుకుంది. అయితే మిగతా జట్లతో పోల్చి చూస్తే బెంగళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవలేదు.


 అన్ని టీమ్స్ లాగా ఎక్కువసార్లు ప్లే ఆప్స్ కి క్వాలిఫై అవడం, లేదంటే ఫైనల్లో అడుగుపెట్టడం లాంటిది కూడా సాధించలేదు. కానీ ఎందుకో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా ఐపీఎల్లో ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి టీంలో మార్పులు చేస్తూ టైటిల్ గెలవాలని జట్టు యాజమాన్యం ఎంతలా భావిస్తున్నా కుదరటం లేదు. ఇక ఇప్పుడు 2024 వరల్డ్ కప్ కోసం కూడా బెంగళూరు ఫ్రాంచైజీ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే కోచింగ్ సిబ్బందిపై వేటు వేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్సిబి జట్టుకు కోచ్గా ఉన్న మైక్ హాసన్ కి కూడా స్వస్తి పలికింది.



 అయితే ఇక ఇటీవలే ఆర్సిబి కోచ్ పదవిపోవడంతో అతను పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఒక టీం కి హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు అన్నది తెలుస్తుంది. గతంలో ఆర్ సి బి తో పాటు న్యూజిలాండ్ కి కూడా హెడ్ కోచ్ గా  పనిచేశాడు మైక్ హాసన్. ఇక ఇటీవల  పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు అతడిని హెడ్ కోచ్ గా నియమించుకుంది. ఇక ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో తెలిపాడు మైక్ హాసన్. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టులో భాగం కావడం సంతోషంగా ఉంది అంటూ ఒక పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: