అయితే టీమ్ ఇండియా వరుస విజయాలతో లీగ్ దశలో అదరగొట్టింది. తొమ్మిది మ్యాచ్ లలో అన్నింటా విజయం సాధించి తిరుగులేని జైత్రయాత్రను కొనసాగించింది. కానీ ఇప్పుడు సెమీఫైనల్ పోరు వచ్చేసరికి భారత అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే గత కొన్ని వరల్డ్ కప్ ల నుంచి టీమిండియా సెమీఫైనల్ లో ఓడిపోయి ఇంటి బాట పడుతుంది. అయితే 2019లో భారత జట్టును ఓడించిన న్యూజిలాండ్ తోనే ఇప్పుడు మరోసారి సెమీఫైనల్ ఆడబోతుంది టీమిండియా. అయితే న్యూజిలాండ్ పై భారత జట్టుకు ఎక్కడ మంచి గణాంకాలు లేవు.
ఒకరకంగా భారత జట్టుపై న్యూజిలాండ్ దే పైచేయి కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో మ్యాచ్ జరగకుండా నేరుగా టీమిండియా ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంటే బాగుండును అందరి కోరుకుంటున్నారూ. అయితే నిజంగానే అలాంటి అవకాశం ఉంది అని చెప్పాలి. ఈ నెల 15వ తేదీన భారత్, న్యూజిలాండ్ సెమీస్కు వర్షం ముప్పు పొంచి ఉందని ముంబై వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మ్యాచ్ జరగకపోతే రిజర్వుడ్ డే ఉంటుంది. ఆట ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలు పెడతారు. ఇక అప్పటికి వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహించలేకపోతే అంపైర్లు పాయింట్ల పట్టికలో ఏ జట్టు లీడింగ్ లో ఉంటే ఆ టీం ఫైనల్ కు చేరుకుంటుంది. టాప్ లో ఉన్న టీమ్ ఇండియా నేరుగా ఫైనల్ గా అడుగుపెడుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి