
అయితే అందరూ ఊహించినట్లుగానే భారత బ్యాట్స్మెన్లు తమ బ్యాటింగ్ విధ్వంసంతో.. భారీగా స్కోర్ చేయడంతో మూడో మ్యాచ్లో భారత జట్టుకు విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ ఊహించనీ రీతిలో సూర్య సేనకి మూడో మ్యాచ్లో చేదు అనుభవం ఎదురయింది అని చెప్పాలి. దూకుడు మీద దూసుకుపోతున్న టీమిండియా విజయాలకు బ్రేక్ పడింది. దీంతో ఇక మిగతా మ్యాచ్లు టీమిడియాకు ఎంతో కీలకంగా మారిపోయాయి. రాయపూర్ లో ఆస్ట్రేలియానూ నిలువరించకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు.
అయితే నాలుగో t20 మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ దాదాపు జట్టులోకి రావడం ఖాయం అయిపోయింది అని చెప్పాలి. అయితే అయ్యర్ రాకతో ఎవరిపై వేటు పడబోతుంది అన్నది ఆసక్తికరంగా మారగా.. తెలుగు క్రికెటర్ పైన వేటు పడబోతుందట. అయితే ఈ టి20 సిరీస్ లో తిలక్ వర్మ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. వైజాగ్ లో 12 పరుగులు, తిరువనంతపురంలో ఏడు, గువహాటిలో 31 పరుగులు మాత్రమే చేశాడు. అతని బ్యాట్ నుంచి పెద్దగా జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ రాలేదు. అదే సమయంలో శ్రేయస్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. దీంతో అతన్ని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది.