
ఇప్పటివరకు అఖిల్ ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన.. ఇక ఒక్క మూవీ కూడా సరైన హిట్ సాధించలేదు అని చెప్పాలి. అయినప్పటికీ నిర్మాతలు అతని మీద భారీ బడ్జెట్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ సినిమా చివరికి డిజాస్టర్ గానే మిగిలిపోయింది. దీంతో అఖిల్ ముందు కాస్త మంచి కథలను ఎంచుకొని సినిమాలు తీసి హిట్ అయిన తర్వాత కమర్షియల్ సినిమాలు చేస్తే బాగుంటుందని.. సినిమా క్రిటిక్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం అఖిల్ మీద భారీ బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఏజెంట్ లాంటి భారీ ఫ్లాప్ తర్వాత కూడా అఖిల్ పై గట్టి నమ్మకంగా ఉన్నారట కొంతమంది నిర్మాతలు. ఈ క్రమంలోనే అఖిల్ తదుపరిచిత్రం కూడా దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది అన్నది తెలుస్తుంది. యువి క్రియేషన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుందట. ఇంత భారీ బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమైంది అంటే ఎవరో స్టార్ డైరెక్టర్ సినిమా తీస్తూ ఉంటాడు అనుకునేరు. ఏకంగా కొత్త డైరెక్టర్ ఈ మూవీ తెరకెక్కించబోతున్నారట. ఇక ఈ మూవీలో గ్రాఫిక్స్ వగైరా భారీగా ఉంటాయట. ధీర అనే టైటిల్ ని ఈ మూవీ కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇలా అఖిల్ పై భారీ బడ్జెట్ పెట్టేందుకు యూవీ క్రియేషన్స్ సిద్ధం కావడంతో ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.