టీమిండియా క్రికెటర్ హనుమ విహారి భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతని ఆట తీరుతో కేవలం టెస్టులలో మాత్రమే అవకాశాలు దక్కించుకోగలిగాడు. గతంలో భారత జట్టు ఆడిన ఎన్నో టెస్ట్ మ్యాచ్ లలో కూడా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే అతనికి పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే ఈ సీనియర్ ప్లేయర్ ను గత కొంతకాలం నుంచి అటు భారత క్రికెట్ లో సెలెక్టర్లు పక్కన పెట్టేస్తూ వస్తున్నారు.


 దేశవాళి క్రికెట్ లో మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ సెలెక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పాలి. ఇక టీమ్ ఇండియాలో అతన్ని చూసి చాలా రోజులైంది. కాగా దేశవాళి టోర్నీలు అయినా రాంజీ ట్రోఫీతో పాటు విజయ్ హజారే ట్రోఫీలలో  మాత్రం అటు ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు హనుమ విహారి. అయితే ఇటీవల హనుమ విహారికి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా వరుసగా మ్యాచ్ లు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల హనుమ విహారి ఏకంగా ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడట.


 ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. రంజీ ట్రోఫీ 2024లో ఆంధ్ర జట్టుకు తొలి మ్యాచ్ కు హనుమ విహారి సారధ్యం వహించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ముంబైతో జరగబోయే మ్యాచ్ కి మాత్రం అతను సారాధ్య భాద్యతల నుంచి తప్పుకోవడం గమనార్హం. దీంతో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ రికీ భూయ్ నీ ఇక ఆంధ్ర జట్టుకు కొత్త కెప్టెన్ గా నియమించింది. బయట వ్యక్తుల ఒత్తిడి వల్ల విహారిని సెలెక్టర్లు తప్పించారని ఆరోపణలు రాగా బ్యాటింగ్ పై దృష్టి పెట్టడానికి అతను సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు అంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: