అయితే ఐపీఎల్ మొదలైన తర్వాత అటు ప్రేక్షకులు అందరూ శనివారం ఆదివారం ఎప్పుడు వస్తుందో అని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు ఒకే మ్యాచ్ మాత్రమే జరిగే ఐపీఎల్లో.. శని ఆదివారాల్లో మాత్రం డబుల్ ధమాకా ఉంటుంది. దీంతో ఇక వీకెండ్ ని క్రికెట్ ఎంటర్టైన్మెంట్ తో పూర్తిగా ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. కాగా నేడు డబుల్ ధమాకా ఉండబోతుంది అని చెప్పాలి.. దీంతో ఇక ఈ రెండు మ్యాచ్లను ఎంజాయ్ చేసేందుకు క్రికెట్ ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. మధ్యాహ్న 3:30 గంటలకు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది.
కాగా అహ్మదాబాద్ స్టేడియం గుజరాత్ టైటాన్స్ కి హోం గ్రౌండ్ కావడం గమనార్హం. దీంతో ప్రస్తుతం దూకుడు మీద ఉన్న సన్రైజర్స్ హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ ని ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక రాత్రి 7:30 గంటలకు విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. కాగా గుజరాత్, సన్రైజర్స్ జట్లు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఒక్కో విజయాన్ని నమోదు చేశాయి. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్ లలో కూడా విజయం సాధించి జోరు మీద ఉంది. అయితే ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో రెండింటిలో కూడా ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచి బోణి కొట్టాలని భావిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి